ఎన్టీఆర్ ఎంట్రీ చూస్తూంటే... రాజమౌళి
యమదొంగ చిత్రాన్ని చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. ఈ సినిమాలో నేను చాలా సినిమాటెక్ లిబర్టీస్ తీసుకున్నాను. స్క్రీన్ ప్లే కూడా కాన్సిస్టెంట్ గా ఉండదు. అయితే యముడుగా తారక్ ఎంట్రీ మాత్రం వెంట్రుకలు నిక్కబొడుచుకునేలా ఉంది ఇప్పటికీ. పెద్దాయన ఎంట్రీనే అస్సలు సినిమా. ఇక క్లైమాక్స్ లో యముడుతో మాట్లాడేటప్పుడు ఎన్టీఆర్ ఎక్సప్రెషన్స్ ఫెంటాస్టిక్ అంటూ ట్వీట్ చేసారు రాజమౌళి. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన యమదొంగ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. మోహన్ బాబు యముడుగా చేసిన ఈ చిత్రంలో స్వర్గంలో పెద్ద ఎన్టీఆర్ కనిపించి తన మనవడుతో మాట్లాడే సీన్స్ హైలెట్ గా నిలుస్తాయి.
ఇప్పటికీ టీవిల్లో వచ్చినప్పుడు ఈ చిత్రం మంచి రేటింగ్స్ తెచ్చుకుంటుంది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో దమ్ము చిత్రం చేస్తున్నారు. రాజమౌళి మాత్రం ఈగ చిత్రం బిజీలో ఉన్నారు. సమంత, నాని కాంబినేషన్ లో యానిమేషన్ ప్రధానంగా ఈ చిత్రం రూపొందనుంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని ఒకే సారి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











