పవన్ కళ్యాణ్ 'పులి' కి డైరక్టర్ రాజమౌళి రిక్వెస్ట్...
'పులి గారు కొంచెం లేటుగా రండి అని మర్యాదగా అడుగుదాము!' అంటూ ట్విట్టర్ లో తాజాగా రాజమౌళి ట్వీట్ చేసారు. అలాగే పులి వచ్చే లోపు మర్యాదరామన్న బయ్యర్స్ కి వాళ్ళ ఇన్వెస్ట్ మెంట్ వచ్చేస్తే చాలు...అన్నారు మరొకరికి ట్వీట్ చేస్తూ రాజమౌళి. ఇక రాజమౌళి మర్యాదరామన్న చిత్రం ఆడియో మొన్న రిలీజ్ అయింది. సునీల్, సలోని కాంబినేషన్లో రెడీ అయిన ఈ చిత్రం జూలై 16న రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక 'మర్యాద రామన్న' చిత్రం ఓ కామిడీ ఫిల్మ్, అలాగని అదేమీ స్లాఫ్ స్టిక్ కామిడీ కాదు. అలాగే నా తరహా రెగ్యులర్ చిత్రం కాదు. చూద్దాం ఈ ఎక్సపెరిమెంట్ ఎలా వర్కవుట్ అవుతుందో అంటున్నారు రాజమౌళి. ఇందులో బ్రహ్మనందం, నాగినీడు కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రానికి యం యం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇంతకీ...అసలు పులి, మర్యాద రామన్న పోటీ పడతాయో లేదో చూడాల్సిందే.
పులి పవన్ కళ్యాణ్ మర్యాద రామన్న సునీల్ సలోని బ్రహ్మానందం రాజమౌళి maryada ramanna sunil saloni rajamouli pawan kalyan puli


Click it and Unblock the Notifications