twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    SS Rajamouli కెరీర్‌లో చివరి మూవీ మహాభారతం.. ఎన్టీఆర్, రాంచరణ్ పాత్రలు ఎలా ఉంటాయంటే

    |

    బాహుబలి సంచలన విజయం తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. గత నాలుగేళ్లుగా రాజమౌళి కోసం తెలుగు ప్రేక్షకులతోపాటు భారతీయ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. RRR సినిమాను ప్యాన్ ఇండియాగా మలిచిన రాజమౌళి ఈ సినిమా ప్రమోషన్స్‌ను దేశవ్యాప్తంగా చేస్తూ..ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతున్నారు. అయితే ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన ప్రమోషన్ ఈవెంట్లలో రాజమౌళి తన చిరకాల స్వప్పం మహాభారతం సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

     RRR మూవీ తర్వాత

    RRR మూవీ తర్వాత

    బాహుబలి తర్వాత RRR సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా రిలీజ్ కరోనావైరస్ పరిస్థితుల కారణంగా అనేక మార్లు వాయిదా పడింది. అయితే ఎట్టకేలకు ఈ సినిమాను జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే RRR సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమాను చేయడానికి రెడీ అవుతున్నారు.

    అద్భుతంగా మహాభారతం

    అద్భుతంగా మహాభారతం

    అయితే రాజమౌళి కెరీర్‌లో అద్బుతంగా నిలిచిపోయే మహాభారతం సినిమా గురించి చర్చ అప్పుడే మొదలైంది. అయితే ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో మహాభారతం తన కెరీర్‌లో చివరి సినిమా అవుతుంది. మహాభారతం తర్వాత నేను రిటైర్ అవుతాను. అయితే అది ఒకట్రెండు కాకుండా ఎక్కువ పార్టుల్లో రిలీజ్ అవుతుంది అని రాజమౌళి చెప్పారు.

    దేశంలోని స్టార్ నటులందరూ

    దేశంలోని స్టార్ నటులందరూ

    ఇక మహాభారతం చిత్రంలో దేశంలోని అగ్ర నటులందరూ కలిసి నటిస్తారు. సినిమా చరిత్రలో చిరకాలం నిలిచిపోయేలా సినిమా ఉంటుంది. అందుకు సంబంధించిన స్క్రిప్టు పనులు మందకోడిగానే జరుగుతున్నప్పటికీ.. తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా నిలిచిపోయేలా నిర్మించాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నట్టు సమాచారం.

    ఎన్టీఆర్, రాంచరణ్ పాత్రల గురించి

    ఎన్టీఆర్, రాంచరణ్ పాత్రల గురించి

    ఇక RRR సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో రాజమౌళి మరోసారి మహాభారతం గురించి ఆసక్తికరమైన సంకేతాలను అందించారు. మహాభారతంలో ఎన్టీఆర్, రాంచరణ్ కూడా నటిస్తారు. అయితే ఆ చిత్రంలో అందరూ ఊహిస్తున్నట్టు వారి పాత్రలు ఉండవు. అయితే ఆ పాత్రలను నేను ఇప్పుడే చెప్పలేను. సరైన సమయంలో వాటి వివరాలు వెల్లడిస్తాను అని జక్కన అన్నారు.

     అభిమానులు గర్వంగా ఫీలయ్యే విధంగా

    అభిమానులు గర్వంగా ఫీలయ్యే విధంగా

    అయితే మహాభారతం సినిమాలో ఎన్టీఆర్, రాంచరణ్ ఫలానా పాత్రల్లో నటిస్తున్నారని జరుగుతున్న ప్రచారం తప్పు. ఆ పాత్రల గురించి నా తరహాలో నేను ప్రకటిస్తాను. ఆ పాత్రల మధ్య సంబంధం గొప్పగా ఉంటుంది. అభిమానులందరూ గొప్పగా చెప్పుకొనేలా ఆ పాత్రలను రూపొందిస్తున్నాను అని ఎస్ రాజమౌళి చెప్పారు.

    English summary
    SS Rajamouli reacted about Mahabharata Movie. He said that I won’t reveal their characters but Both #NTR & #RamCharan Will be Part of #Mahabharata Movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X