కిరాక్ న్యూస్: పవన్, మహేష్‌‌తో రాజమౌళి హిస్టారికల్ మూవీ!

By Bojja Kumar

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాజమౌళి చాలా కాలంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలని ఉవ్విళ్లూరుతున్న సంగతి తెలిసిందే. అనేక సందర్భాల్లో రాజమౌళి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం 'బాహుబలి' షూటింగులో బిజీగా ఉన్న రాజమౌళి...తర్వాతి సినిమా ఆ ఇద్దరు హీరోలతో కలిసి చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీలో తెరకెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

రాజమౌళి సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి ఇప్పటికే స్ర్రిప్టు రెడీ చేసారని, ఈ చిత్రాన్ని కూడా బాహుబలి మాదిరి ఒక పీరియడ్ డ్రామాగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడట. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్‌ బాడీ లాంగ్వేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ కథను రెడీ చేసుకున్నాడు. చారిత్రక నేపథ్యంతో కూడిన ఈ చిత్రం స్టోరీని రాజమౌళి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్‌కు చెప్పి...వారి నుండి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు కున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని నాలుగు బాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లను ఈ సినిమా కోసం తీసుకునే ప్లాన్లో ఉన్నారు. ఇందుకోసం ఐశ్వర్యరాయ్, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, దీపిక పదుకోన్ లాంటి హీరోయిన్ల పేర్లు పరిశీలిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌తో మ్యూజిక్ చేయించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

బడ్జెట్ ఎంతంటే?

బడ్జెట్ ఎంతంటే?

సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం....ఈ చిత్రాన్ని రూ. 100 కోట్ల పైచిలుకు బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటోంది.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

ప్రస్తుతం జన సేన పార్టీ ప్రచారంలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్..... గబ్బర్ సింగ్ 2, ఓ మై గాడ్ తెలుగు రీమేక్‌కు కమిట్ అయ్యారు. రాజమౌళి సినిమాకు ముందే ఈ రెండు చిత్రాలు పూర్తి చేయనున్నారు పవన్.

మహేష్ బాబు అప్ కమింగ్ ప్రాజెక్ట్స్

మహేష్ బాబు అప్ కమింగ్ ప్రాజెక్ట్స్

ప్రస్తుతం మహేష్ బాబు ‘ఆగడు' సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. ఆగడు చిత్రం తర్వాత మహేష్ బాబు ఏ సినిమాకు కమిట్ కాలేదు. రాజమౌళి సినిమా కోసమే ఆయన తన డేట్స్ కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

రాజమౌళి

రాజమౌళి

ప్రస్తుతం రాజమౌళి ప్రభాస్, రానా, అనుష్కలతో ‘బాహుబతి'చిత్రం తెరకెక్కిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రం 2015లో పూర్తి కానుంది. దీని తర్వాత ఆయన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్‌లతో సినిమా చేయబోతున్నారు.

పవన్, మహేష్, రాజమౌళి రీలీజ్ ఎప్పుడు

పవన్, మహేష్, రాజమౌళి రీలీజ్ ఎప్పుడు

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కబోయే చిత్రం 2015 డిసెంబర్లో మొదలై, 2016 దీపావళికి విడుదలయ్యే అవకాశం ఉంది.

ఏప్రిల్ ఫూల్....

ఏప్రిల్ ఫూల్....

ఈ వార్తను మీరు నిజమని నమ్ముతున్నారా? అయితే మీరు ఏప్రిల్ ఫూల్ అయినట్లే. ఫూల్స్ డేను పురస్కరించుకుని ఈ సరదా వార్త ప్రచురించడం జరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X