twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆస్కార్‌కు ముందు RRR మూవీకి షాక్.. రాజమౌళికి ఊహించని చేదు అనుభవం!

    |

    దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన RRR చిత్రం టాక్ ఆఫ్ ది వరల్డ్ సినిమాగా మారింది. విదేశీ గడ్డ మీద భారతీయ సినిమా పతాకాన్ని ఎగురవేస్తున్నది. ప్రపంచ సినిమాలో పేరెన్నిక గల అవార్డులను గంపగుత్తగా పట్టేసుకొనే పనిలో పడింది. అయితే ప్రపంచంలో అత్యుత్తమంగా భావించే అవార్డుకు నామినేట్ కాకపోవడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ అవార్డు వివరాలు.. RRR చేస్తున్న హంగామా విషయంలోకి వెళితే..

    ఆస్కార్ అవార్డులో రేసులో అలా..

    ఆస్కార్ అవార్డులో రేసులో అలా..

    RRR చిత్రం ఆస్కార్ బరిలోకి దూకేందుకు ప్రయత్నించగా.. ఛెల్లో షో అనే గుజరాతీ సినిమా అడ్డుపడింది. RRR నుంచి వస్తున్న పోటీని తట్టుకొని చెల్లో షో ఆస్కార్‌కు నామినేట్ కావడం దేశీయ సినీ పండితులను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున కాకుండా ఆస్కార్‌లో నామినేషన్‌కు కావాల్సిన అర్హతలను వ్యక్తిగతం సంతృప్తి పరుస్తూ అకాడమీ అవార్డుల రేసులో సాగుతున్నది.

    జోరుగా RRR టీమ్ ప్రమోషన్స్

    జోరుగా RRR టీమ్ ప్రమోషన్స్

    RRR చిత్రానికి ఆస్కార్ సాధించడానికి దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్, కీరవాణి‌ ఇతర యూనిట్ సభ్యులు జోరుగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ప్రపంచ సినిమా గుర్తింపు కోసం ప్రతీ గడప ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆస్కార్ గెలుచుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలను ప్రారంభించారు.

    జేమ్స్ కామెరాన్, గోల్డెన్ గ్లోబ్ అవార్డులు

    జేమ్స్ కామెరాన్, గోల్డెన్ గ్లోబ్ అవార్డులు

    అయితే ఆస్కార్ అవార్డు సాధించే క్రమంలో క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో ఉత్తమ విదేశీ చిత్రంగా అవార్డు గెలుచుకొన్నది. అలాగే గోల్డెన్ గ్లోబ్ అవార్డు 2023లో నాటు నాటు పాటకు బెస్ట్ సాంగ్ అవార్డును RRR గెలుచుకొన్నది. జేమ్స్ కామెరాన్, స్పిల్ బర్గ్ లాంటి సినీ దిగ్గజాల ప్రశంసలు అందుకొంటూ రాజమౌళి ముందుకు వెళ్లున్నారు.

    బాఫ్టా అవార్డుల్లో చోటు దక్కని

    బాఫ్టా అవార్డుల్లో చోటు దక్కని

    అయితే ఆస్కార్ అవార్డు సాధించే ప్రయాణంలో రాజమౌళి టీమ్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ప్రపంచంలోనే అత్యుత్తమ అవార్డుల్లో ఒకటిగా భావించే బాఫ్టా అవార్డుల్లో నామినేషన్‌ సాధించలేకపోవడం అభిమానులను నిరుత్సాహ పరిచింది. టాప్ 5 చిత్రాల్లో ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్, అర్జెంటీనా 1985, కోర్సేజ్, డిసిషన్ టూ లీవ్, ది క్వయిట్ గర్ల్ అనే సినిమాలు బాఫ్టా అవార్డుల నామినేషన్ సాధించాయి.

    RRR చిత్రం ప్రపంచవ్యాప్తంగా

    RRR చిత్రం ప్రపంచవ్యాప్తంగా

    మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆలియా భట్, అజయ్ దేవగన్ తదితరులు నటించిన RRR చిత్రం దేశవ్యాప్తంగా రికార్డు వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద రేర్ ఫీట్ సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం అవార్డుల వేట ప్రారంభించింది.

    English summary
    World's Popular Director SS Rajamouli's RRR is setting big trend all over world. This movie is got awards like Golden Globe and Critic Choice award. In this situation, This movie fails to get Nominations in BAFTA 2023 awards.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X