twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Critics Choice Awards: రాజమౌళి RRR మరో ఘనత.. ఏకంగా 5 విభాగాల్లో నామినేట్!

    |

    మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించగా.. దర్శకధీరుడు రాజమౌళి చెక్కిన కళాఖండం RRR చిత్రం. కొమురం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతి ఎల్లలు దాటింది. సుమారు రూ. 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపుగా రూ. 1200కుపైగా కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ఈ సినిమా ప్రతిష్టాత్మక ఆస్కార్ నామినేషన్ కోసం బరిలోకి దిగింది. ఈ క్రమంలోనే పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ కు నామినేట్ అవుతోంది. తాజాగా క్రిటిక్ ఛాయిస్ అవార్డ్స్ కు ఏకంగా 5 విభాగాల్లో నామినేట్ అయింది.

    ఇండిపెండెంట్ కెటగిరీలో..

    ఇండిపెండెంట్ కెటగిరీలో..

    దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా RRR. కొమురం భీమ్, అల్లూరి సీతారామారాజుకు సంబంధించిన కథను ఆధారంగా చేసుకొని కల్పితంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను ఆకట్టుకొంటోంది. రాజమౌళి RRR మూవీ ఆస్కార్ నామినేషన్ కోసం ప్రయత్నించింది. అయితే ఇండిపెండెంట్ కేటగిరీలో ప్రతిష్టాత్మక ఆస్కార్‌ను దక్కించుకొనేందుకు RRR ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే పలు అవార్డులను గెలుచుకోవడంతోపాటు మరికొన్ని అవార్డుల నామినేషన్స్ ను సాధిస్తోంది.

    రెండు కేటగిరీలో..

    రెండు కేటగిరీలో..

    ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2023 నామినేషన్స్ లో రెండు విభాగాల్లో నామినేట్ అయింది RRR చిత్రం. బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాగ్వేంజ్ ఫిల్మ్ కేటగిరీతోపాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట నామినేట్ అయింది. అయితే ఈ అవార్డ్స్ నామినేషన్స్ కోసం భారతదేశం నుంచి ఆలియా భట్ నటించిన గంగుభాయ్ కతియావాడి, రిషబ్ శెట్టి నిర్మించి, నటించిన కంతారా, ఛెల్లో షో సినిమాలు పోటీ పడగా చివరిగా RRR మూవీ రెండు విభాగాల్లో నామినేట్ అవ్వడం విశేషం.

    ఐదు చిత్రాలతోపాటు..

    ఐదు చిత్రాలతోపాటు..

    గోల్డెన్ గ్లోబ్ అవార్డుల నామినేషన్స్ లో ఇండియా తరుఫున ఎన్నికైన ఏకైక చిత్రంగా RRR ఘనతను సాధించింది. ఇక RRR చిత్రం గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కోసం నామినేట్ అయిందని స్యయంగా ఆ సంస్థ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. బెస్ట్ పిక్చర్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ది క్వయిట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్, అర్జెంటీనా1985, క్లోజ్, డిసిషన్ టు లీవ్ సినిమాలతోపాటు RRR చిత్రం కూడా పోటీ పడుతోందని తెలిపింది.

     ఏకంగా 5 విభాగాల్లో చోటు..

    ఏకంగా 5 విభాగాల్లో చోటు..

    ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల నామినేషన్స్ తర్వాత మరో అవార్డు నామినేషన్స్ లో చోటు సంపాదించుకుంది జక్కన్న RRR చిత్రం. క్రిటిక్ ఛాయిస్ అవార్డ్స్ కు సంబంధించిన నామినేషన్లలో ఏకంగా ఐదు విభాగాల్లో నామినేట్ అయింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్, బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్, బెస్ట్ సాంగ్ (నాటు నాటు) ఇలా ఐదు కేటగిరీల్లో నామినేట్ అయి మరోసారి సత్తా చాటింది RRR మూవీ.

     600కుపైగా మీడియా క్రిటిక్స్ ప్రాతినిధ్యం..

    600కుపైగా మీడియా క్రిటిక్స్ ప్రాతినిధ్యం..

    ఈ క్రిటిక్ ఛాయిస్ అవార్డ్స్ అనేది అమెరికా, కెనడాలో అతిపెద్ద విమర్శకుల సంస్థ. ఈ అవార్డ్స్ కు 600కుపైగా మీడియా క్రిటిక్స్, ఎంటర్టైన్ మెంట్ జర్నలిస్ట్స్ ప్రాతినిధ్యం వహిస్తారు. ఇంతమంది ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ అవార్డ్స్ కి నామినేట్ అవ్వడం అంటే ప్రత్యేకమైన గుర్తింపు సాధించినట్లు. ఎందుకంటే ఇంతమంది క్రిటిక్స్ ఈ సంవత్సరం థియేటర్ లో చూసిన సినిమాగా RRR చోటు సంపాదించుకుంది.

    రెండు అవార్డ్స్ కి నామినేట్..

    ఇదిలా ఉంటే RRR మూవీలోని నాటు నాటు సాంగ్ కు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ వచ్చిందో తెలిసిందే. ఇప్పటికే ఈ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ నామినేషన్స్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ కాగా.. తాజాగా బెస్ట్ సాంగ్ విభాగంలో నాటు నాటు అర్హత సాధించడం గొప్ప విషయం. దీంతో నాటు నాటు పాటకు ఎంతటి క్రేజ్ ఉందో అర్థమవుతోంది.

    English summary
    SS Rajamouli Directed Movie RRR Gets 5 Nominations In Critics Choice Awards 2023 After Golden Globes 2023
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X