twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRRకి మరో ప్రతిష్టాత్మక అవార్డు.. ఇప్పటివరకు రానీ సరికొత్త కేటగిరీలో పురస్కారం!

    |

    తెలుగు దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన అద్భుతమైన కళాఖండం RRR. కొమురం భీమ్ గా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ మల్టీ స్టారర్ గా వచ్చిన ఈ మూవీపై యావత్ ప్రపంచమే ప్రశంసల వర్షం కురిపించింది. ఇంకా సినీ ప్రముఖులు, క్రిటక్స్ కొనియాడుతున్నారు. ఈ క్రమంలో రౌద్రం రణం రుధిరం సినిమా అనేక అవార్డులు గెలుచుకుంటోంది. ఇటీవలే నాటు నాటు సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కగా ఆ పురస్కారాన్ని సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి అందుకున్నారు. అలాగే ఫారెన్ లాంగ్వెజ్ మూవీ విభాగంలో మరో అవార్డు లభించింది. ఇప్పుడు తాజాగా సరికొత్త కేటగిరీలో మరో ప్రతిష్టాత్మక అవార్డు RRRను వరించింది.

    ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతూ..

    ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతూ..


    తెలుగు చిత్రీసీమ దర్శక దిగ్గజం, జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన మగధీర, ఈగ, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కంక్లూజన్, ఆర్ఆర్ఆర్ చిత్రాలు తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాయి. గతేడాది విడుదలై సునామీ సృష్టించిన సినిమా RRR. ఈ సినిమాకు ఆది నుంచే అవార్డుల పంట మొదలైంది. ఇప్పటికే అనేక అవార్డులు గెలుచుకుంటూ ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతోంది రౌద్ర రణం రుధిరం చిత్రం.

    భార్య, కుమారుడుతో కలిసి..

    భార్య, కుమారుడుతో కలిసి..

    ప్రస్తుతం రాజమౌళి RRR సినిమాకు ఇంటర్నేషనల్ అవార్డుల పంట కొనసాగుతోంది. మొదటగా న్యూయార్క్ లో జరిగిన న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (NYFCC) కార్యక్రమంలో ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు రాజమౌళి. ఈ కార్యక్రమానికి రాజమౌళి తన భార్య రమ, కుమారుడు కార్తికేయతో కలిసి వేడుకకు హాజరయ్యారు. అవార్డు అందుకున్న అనంతరం తనదైన శైలీలో ఇచ్చిన స్పీచ్ తో అందరిచేత చప్పట్లు కొట్టించారు.

    క్రిటిక్స్ ఛాయిస్ లో రెండు..

    క్రిటిక్స్ ఛాయిస్ లో రెండు..

    ఇటీవల ఎంతో సూపర్ హిట్ అయిన నాటు నాటు పాటకు వచ్చిన గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. ఈ పురస్కారాన్ని సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి అందుకున్నారు. అలాగే కాలిఫోర్నియాలో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల కార్యక్రమంలో బెస్ట్ సాంగ్‌గా నాటు నాటు పాట మరో అవార్డు దక్కించుకోగా.. బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ మూవీ విభాగంలో RRR సినిమా ఎంపికైంది.

     మరో ప్రతిష్టాత్మక పురస్కారం..

    మరో ప్రతిష్టాత్మక పురస్కారం..


    నాటు నాటు పాటకు వచ్చిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డును మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ఎమ్ కీరవాణి అందుకోగా.. బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ సినిమా విభాగంలో వరించిన పురస్కారాన్ని రాజమౌళి, ఆయన కుమారుడు కార్తికేయ కలిసి అవార్డును అందుకున్నారు. ఇలా అవార్డులను కొల్లగొడుతున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ మల్టీ స్టారర్ సినిమా RRR సినిమా తాజాగా మరో ప్రతిష్టాత్మక అవార్డును వరించింది.

    యాక్షన్ కొరియోగ్రఫీ కేటగిరీలో..

    యాక్షన్ కొరియోగ్రఫీ కేటగిరీలో..

    ఇప్పటి వరకు RRR చిత్రానికి సంబంధించి ఉత్తమ పాట, ఉత్తమ విదేశీ చిత్రం వంటి కేటగిరీలో అవార్డులు దక్కాయి. కానీ, ఈసారి సరికొత్త విభాగంలో RRR చిత్రం పురస్కారం పొందింది. ప్రముఖ సీటెల్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ (Seattle Film Critics Society)జ్యూరీ మెంబర్స్ RRR చిత్రానికి అత్యుత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ విభాగంలో అవార్డును ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సినిమా యూనిట్ ను ప్రశంసించారు. విక్కీ అరోరా, ఇవాన్ కోస్డాడినోవ్, నిక్ పావెల్, రాయిచో వాసిలేవ్ లు స్టంట్ కో ఆర్డినేటర్లుగా వ్యవహరించారు. ప్రేమ్ రక్షిత్, దినేష్ క్రిష్ణన్ కొరియోగ్రఫీ అందించారు.

    RRR కు అకాడమీ అవార్డ్..

    ఇదిలా ఉంటే 2023 ఆస్కార్ అవార్డుల్లో భాగంగా అకాడమీ పది విభాగాల్లో షార్ట్ లిస్టులను విడుదల చేసింది. ఇందులో ఒరిజినల్ సాంగ్ విభాగంలో పదిహేను పాటలను ఉంచగా.. వాటిలో RRR మూవీలోని 'నాటు నాటు' సాంగ్ కూడా చోటు దక్కించుకుంది. అంతేకాకుండా బెస్ట్ ఫీచర్ సినిమా విభాగంలో RRR కూడా చోటు దక్కించుకుంది. దీంతో ఏదో ఒక విభాగంలో RRR సినిమాకు ఆస్కార్ అవార్డ్ వస్తుందని తెలుగు ప్రేక్షకులు ఆశాభావంతో ఉన్నారు.

    English summary
    Director SS Rajamouli Junior NTR Ram Charan Movie RRR Wins Another Precious Seattle Film Critics Award For Best Action Choreography.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X