RRR సంచలనం.. ప్రపంచంలోనే అతిపెద్ద థియేటర్‌లో స్పెషల్ షో.. సీటింగ్ కెపాసిటీ తెలిస్తే!

తెలుగు దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన అద్భుతమైన చిత్రం RRR. అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కొమురం భీమ్ గా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భారీ మల్టీ స్టారర్ గా వచ్చిన ఈ సినిమాపై యావత్ ప్రపంచమే ప్రశంసల వర్షం కురిపించింది.

ఇంకా సినీ ప్రముఖులు, క్రిటక్స్ కొనియాడుతున్నారు. ఈ క్రమంలో రౌద్రం రణం రుధిరం సినిమా అనేక అవార్డులు గెలుచుకుంటూ సత్తా చాటుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు గోల్డెన్ గ్లోబ్, న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్, సీటెల్ ఫిల్మ్ క్రిటిక్స్ వంటి అవార్డ్సు గెలుచుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీనింగ్ లో ప్రదర్శించారు.

అవార్డులు గెలుచుకుంటూ..

తెలుగు చిత్రీసీమ దర్శక దిగ్గజం, జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన మగధీర, ఈగ, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కంక్లూజన్, ఆర్ఆర్ఆర్ చిత్రాలు తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాయి. ఇక గతేడాది విడుదలై సునామీ సృష్టించిన సినిమా RRR.

ఈ సినిమాకు ఆది నుంచే అవార్డుల పంట మొదలైంది. ఇప్పటికే అనేక అవార్డులు గెలుచుకుంటూ ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతోంది ఈ చిత్రం. అలాగే నాటు నాటు ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే.

వరల్డ్ ఫిదా..

రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ, దర్శకుడు రాజమౌళి టేకింగ్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం, పాటలు, కొరియోగ్రఫీ, యాక్షన్ స్టంట్స్ అన్నింట్లో మార్కులు కొట్టేసింది RRR (రౌద్రం రణం రుధిరం) సినిమా. అంతేకాకుండా ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ అదరగొట్టగా, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హావాభావాలు, ఎమోషన్స్ కు యావత్ ప్రపంచమే ఫిదా అయి ప్రశంసల జల్లులు కురిపిస్తోంది.

5 విభాగాల్లో..

5 విభాగాల్లో..

RRRలోని నాటు నాటు పాటకు కచ్చితంగా ఆస్కార్ అవార్డు వస్తుందని చిత్ర యూనిట్ తో పాటు కోట్లాది భారతీయులు నమ్ముతున్నారు. ఈ క్రమంలో ఆస్కార్ వేడుకల కంటే ముందుగానే చిత్రబృందం అమెరికా వెళ్లగా.. హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్ (HCA Awards) అవార్డ్స్ ప్రదానోత్సవంలో పాల్గొంది. ఈ అవార్డ్సులో ఏకంగా ఐదు విభాగాల్లో RRR సినిమా నామినేట్ కావడం విశేషం.

స్పాట్ లైట్ అవార్డుతో..

స్పాట్ లైట్ అవార్డుతో..

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ టీమ్ అమెరికాలో ఉంది. ఇటీవల జరిగిన హెచ్సీఏ అవార్డ్ ప్రదానోత్సవంలో డైరెక్టర్ రాజమౌళి, కీరవాణి, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, జక్కన్న కుమారుడు కార్తికేయ పాల్గొన్నారు. ఇక రామ్ చరణ్ ఈ అవార్డ్సుకు స్పెషల్ గెస్టులో ఒకరిగా హాజరయ్యాడు. చెర్రీ చేతులమీదుగా ఒక అవార్డు ప్రదానం చేయగా.. ఆయన్ను స్పాట్ లైట్ అవార్డుతో సత్కరించారు. అయితే తారకరత్న మరణం కారణంగా జూనియర్ ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లలేకపోయారు.

1647 సీటింగ్ కెపాసిటీ..

1647 సీటింగ్ కెపాసిటీ..

ఇదిలా ఉంటే RRR సినిమా గతేడాది మార్చి 25న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజై సరిగ్గా 342 రోజులు అవుతుంది. ఈ సందర్భంగా వరల్డ్ లోనే అతిపెద్ద స్క్రీనింగ్ థియేటర్ అయిన లాస్ ఏంజెల్స్ లోని 'ది థియేటర్ ఎట్ ఏస్ హోటల్'లో మార్చి 1న RRR చిత్రాన్ని ప్రదర్శించారు. 1647 సీటింగ్ కెపాసిటీ గల ఈ థియేటర్ టికెట్స్ మొత్తం విడుదలకు ముందే అమ్ముడుపోయాయి. మార్చి 1న సాయంత్రం 7:30 నిమిషాలకు స్క్రీనింగ్ జరిగింది.

సింగర్స్ తో లైవ్ షో..

కాగా.. మార్చి 12న లాస్ ఎంజెల్స్ వేదికగా జరగనున్న ఆస్కార్ వేడుకల్లో RRR టీమ్ పాల్గొననుంది. ఆరోజు రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ కలిసి నాటు నాటు లైవ్ ఫర్ఫామెన్స్ ఇవ్వనున్నారు. గోల్డెన్ గ్లోబ్ అందుకున్న నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డును కూడా వరిస్తుందని టీమ్ తో పాటు భారతీయ తెలుగు ప్రేక్షకులు గట్టి నమ్మకంతో ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X