Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
RRR nominated for Golden Globes 2023 రాజమౌళి కిరీటంలో మరో ఘనత.. అవార్డు రేసులో నాటు నాటు సాంగ్!
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన RRR చిత్రం అరుదైన గౌరవాన్ని దక్కించుకొన్నది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులుగా పేర్కొనే గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కోసం ఇండియాలో ఐదు చిత్రాలు పోటీపడగా చివరకు RRR రేసులో నిలిచింది. ఈ విషయాన్ని నిర్మాత డీవీవీ దానయ్యకు సంబంధించిన సొంత బ్యానర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ సెన్సేషనల్ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఆస్కార్ వేటలో RRR
కొమురం భీమ్, అల్లూరి సీతారామారాజుకు సంబంధించిన కథను ఆధారంగా చేసుకొని కల్పిత కథగా తెరకెక్కిన RRR చిత్రం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను ఆకట్టుకొంటున్నది. ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ కోసం ప్రయత్నించింది. అయితే ఇండిపెండెంటెడ్ క్యాటగిరీలో ప్రతిష్టాత్మక ఆస్కార్‌ను దక్కించుకొనేందుకు RRR ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డుల నామినేషన్‌ను కూడా సాధించింది.

గంగుభాయ్, కంతారాను తప్పించి..
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల నామినేషన్ కోసం ఇండియా నుంచి ఐదు చిత్రాలు బరిలో నిలిచాయి. వాటిలో భారీ పోటీ ఇచ్చిన చిత్రాల్లో ఆలియా భట్ నటించిన గంగుభాయ్ కతియావాడి, రిషబ్ శెట్టి నిర్మించి, నటించిన కంతారా, ఛెల్లో షో సినిమాలు ఉన్నాయి. ఛెల్లో షో ఇప్పటికే ఆస్కార్ అవార్డుల కోసం జరిగిన నామినేషన్‌లో చోటు దక్కించుకొన్న విషయం తెలిసిందే.
|
రెండు క్యాటగిరీల్లో నామినేషన్
RRR చిత్రం గోల్డెన్ గ్లోబ్ అవార్డుల నామినేషన్ సాధించిన వివరాల్లోకి వెళితే.. బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాగ్వేంజ్ ఫిల్మ్, అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట నామినేట్ అయింది. ఇండియా తరుఫున ఎన్నికైన ఏకైక చిత్రంగా RRR ఘనతను సాధించింది. ఇప్పటికే నాటు నాటు పాటకు ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.
|
ఐదు చిత్రాలతో పోటీపడుతున్న RRR
ఇక RRR చిత్రం గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కోసం నామినేట్ అయిందని స్యయంగా ఆ సంస్థ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. బెస్ట్ పిక్చర్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ది క్వయిట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్, అర్జెంటీనా1985, క్లోజ్, డిసిషన్ టు లీవ్ సినిమాలతోపాటు RRR చిత్రం కూడా పోటీ పడుతున్నదని తెలిపింది.

గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానం ఎప్పుడంటే?
ది గ్లోల్డెన్ గ్లోబ్స్ అవార్డు కార్యక్రమాన్ని హాలీవుడ్ ఫారీన్ ప్రెస్ అసోసియేషన్ నిర్వహిస్తున్నది. గతంలో వర్ణ వివక్ష, లైంగిక వేధింపులు, తదితర ఆరోపణల కారణంగా టామ్ క్రూయిజ్‌తో కూడిన హాలీవుడ్ నటులతోపాటు ఎన్‌బీసీ ఈ అవార్డుల కార్యక్రమాన్ని బహిష్కరించాయి. అయితే ఈ సారి ఎన్బీసీ ఈ అవార్డుల కార్యక్రమంలో భాగం కానున్నది. ఈ అవార్డుల కార్యక్రమం జనవరి 10 నుంచి 11 తేదీ వరకు కొనసాగుతాయి. ఈ వేడుకలకు కమెడియన్ జెర్రోడ్ కార్మిచెల్ హోస్ట్‌గా వ్యవహరిస్తారు.