twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి-2 రష్యన్ ట్రైలర్ అదుర్స్..

    By Rajababu
    |

    Recommended Video

    Baahubali 2 Russian Trailer, Watch

    బాహుబలి ది బిగినింగ్, బాహుబలి2 ది కన్‌క్లూజన్ చిత్రాలు దర్శకుడు రాజమౌళికి,యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డాషింగ్ హీరో రానా దగ్గుబాటికి మంచి పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయి. ఈ చిత్రం ఇండియన్ సినిమా రికార్డులను తిరుగరాస్తూ 1000 కోట్ల క్లబ్లో చేరిన దక్షిణాది చిత్రంగా బాహుబలి2 రికార్డు సృష్టించింది. తాజాగా జపాన్‌లో రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ రష్యా వెర్షన్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

    తగ్గని బాహుబలి2 క్రేజ్

    తగ్గని బాహుబలి2 క్రేజ్

    బాహుబలి2 సినిమా రిలీజై ఏడు నెలలు గడిచినా గానీ ఇంకా ఆ మధురస్మృతులు మది నుంచి తొలగిపోవడం లేదు. బాహుబలి చిత్రం కేవలం తెలుగు వాళ్లనే కాదు.. దేశంలోని సినీ ప్రేక్షకులందరినీ మొత్తాన్ని ఉర్రూతలూగించింది.

    ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు

    ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు

    భారతీయ సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా బాహుబలి2 చిత్రం తొలిసారి 1000 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1700 కోట్లు వసూలు చేసింది. కేవలం తమిళనాడులో గతంలో ఏ తెలుగు చిత్రం వసూలు చేయని విధంగా 150 కోట్ల రూపాయలను వసూలు చేయడం గమనార్హం. కేవలం 16 రోజుల్లోనే తమిళ బాహుబలి 100 కోట్ల క్లబ్‌లోకి చేరడం అక్కడ ఓ రికార్డు.

     జపాన్‌లో రిలీజ్‌కు అంతా సిద్ధం

    జపాన్‌లో రిలీజ్‌కు అంతా సిద్ధం

    బాహుబలి2 సినిమా బాలీవుడ్ చిత్రాలు సుల్తాన్, దంగల్ సినిమాల రికార్డులను తిరగరాసింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా రికార్డు సృష్టించిన బాహుబలి జపాన్‌లో కలెక్షన్ల సునామీ సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. బాహుబలి2 చిత్రం డిసెంబర్ 29న రిలీజ్‌కు సిద్దమవుతున్నది.

    రష్యాలో ట్రైలర్ రిలీజ్

    బాహుబలి2 జపాన్‌ రిలీజ్‌కు ఏర్పాట్లు జరుగుతుండగా, చైనా, రష్యన్ భాషలో ఈ సినిమా ను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన రష్యన్ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ మీకోసం..

    English summary
    Baahubali 2 has many first-time records. It’s the first Indian film to breach into the INR 1500 crore club, crushing all records across the length and breadth of the globe. Now this prestigious movie is set release in Japan language. Rajamouli directorial is all set to test its luck at the Japanese box office, with a release on December 29. Apart from this, This movie is going to release in China and Russia. In this occassion, Film Unit released Russian version trailer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X