twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రష్యా టెలివిజన్‌లో బాహుబలి.. మరోసారి చరిత్ర సృష్టించిన రాజమౌళి

    |

    ప్రపంచ పటంపై బాహుబలి హంగామా ఇంకా కొనసాగుతూనే ఉంది. దర్శకుడు ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేసిన మ్యాజిక్ పలు దేశాల్లో ఇంకా ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచుతున్నది. సినిమా రిలీజై మూడేళ్లు దాటుతున్న ప్రపంచ దేశాల్లోనే ఏదో ఒక దేశంపై బాహుబలి హంగామా ఏదో ఒక రోజు కనిపిస్తూనే ఉంది. బాహుబలి చిత్రం రష్యా టెలివిజన్‌లో ప్రసారం కావడం, ఆ దేశ ఎంబసీ కీర్తించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

    దేశ సినిమా చరిత్రలో బాహుబలి

    దేశ సినిమా చరిత్రలో బాహుబలి

    సుమారు మూడేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా రిలీజైన బాహుబలి: ది కన్‌క్లూజన్ బాక్సాఫీస్‌ను రికార్డులతో కుదిపేసింది. దేశ బాక్సాఫీస్ చరిత్రలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా బాహుబలి రికార్డులు తిరగరాసింది. భారతీయ సినిమా చరిత్రలో ఓ ఉత్తమ చిత్రంగా నిలిచిపోయింది. ఈ చిత్రంలో నటించిన ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ లాంటి నటీనటులు అద్భుతమైన ఖ్యాతిని తెచ్చిపెట్టింది.

    రష్యా గడ్డపై బాహుబలి హవా

    రష్యా గడ్డపై బాహుబలి హవా

    తాజాగా భారతీయ సినిమా పాపులారిటీని మరోసారి రష్యా గడ్డపై బాహుబలి చాటిచెప్పింది. ఈ సినిమా రష్యా భాషల్లోకి అనువదింపబడి అక్కడి టెలివిజన్లలో ప్రసారమైంది. రష్యా భాషలో ప్రసారమైన ఈ చిత్రానికి అనూహ్యమైన స్పందన కనిపించింది అని రష్యా ఎంబసీ ఓ ప్రకటనలో తెలిపింది.

    మే 28న టెలివిజన్‌లో ప్రసారం

    మే 28న టెలివిజన్‌లో ప్రసారం

    రష్యా టెలివిజన్‌లో బాహుబలి చిత్రం మే 28న ప్రసారమైంది. ఈ చిత్రాన్ని రష్యన్ భాషలోకి అనువాదం చేసి ప్రసారం చేయడం జరిగింది అని రష్యన్ ఎంబసీ ఫెడరేషన్ ఓ వీడియోను విడుదల చేసింది. రష్యన్ భాషలోకి అనువాదం అయిన భారతీయ సినిమాల్లో ఇది అరుదైన చిత్రమని ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఈ చిత్రానికి రష్యా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని తెలిపారు.

    Recommended Video

    Mahanati Director Nag Ashwin On Liquor Selling In Theatre & Multiplexes
    1800 కోట్ల వసూళ్లతో

    1800 కోట్ల వసూళ్లతో

    రష్యా భాషలో అక్కడి ప్రేక్షకుల నుంచి బాహుబలికి ఆదరణ దక్కడంపై భారతీయ ప్రేక్షకులు దేశానికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు తమ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఈ చిత్ర యూనిట్, రాజమౌళిపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. సుమారు 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

    English summary
    Indian Director SS Rajamouli's Baahubali created history on Russian Televison. Russian Embassy wrote, "Indian cinema gains popularity in Russia. Look what Russian TV is broadcasting right now: the Baahubali with Russian voiceover!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X