Just In
- 1 hr ago
అభిమాని పెళ్లిలో సడన్‌గా ప్రత్యక్షమైన స్టార్ హీరో.. అతిధులంతా షాక్!
- 1 hr ago
రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ రూమర్స్ అన్ని అబద్ధాలే!
- 2 hrs ago
బిగ్ బాస్ 5 మొదలయ్యేది ఎప్పుడంటే.. మరోసారి సోహెల్ కూడా..
- 3 hrs ago
ఆ మూడు గుర్రాలతో.. రిపబ్లిక్ అనే పదానికి అసలైన అర్దాన్ని చెబుతున్న మెగా హీరో
Don't Miss!
- News
వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం -కుటుంబాలపై ఇలా రాయొచ్చా? నీతిమాలిన చర్యలంటూ..
- Sports
షకీబుల్ అరుదైన రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్లో ఏకైక ప్లేయర్‌గా!!
- Finance
ఈఎస్ఐ పథకంలో చేరిన 9.33 లక్షల మంది.. డేటా రిలీజ్
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రాణా ట్వీట్: రాజమౌళిలోని రాక్షస కోణం!
హైదరాబాద్ : సినిమాకు కెప్టెన్‌గా ఉండే దర్శకుడు పని రాక్షసుడు అయితే...ఇక ఆర్టిస్టుల అవస్థలు వర్ణనాతీతం. తాజాగా 'బాహుబలి' సినిమా షూటింగ్ విషయంలో దర్శకుడు రాజమౌళి పని రాక్షసుడిగా మారాడని ఆ చిత్రంలో నటిస్తున్న రాణా చేసిన వ్యాఖ్యలను బట్టి స్పష్టం అవుతోంది. అఫ్‌కోర్స్ ఇదంతా....అందరి మంచి కోసం, సినిమా త్వరగా పూర్తి కావాలనే అనుకోండి!
సినిమా విషయంలో ఎంత చిత్తశుద్ధిగా ఉంటే మాత్రం 24 గంటలూ ఎడతెరిపి లేకుండా పని చేయించడం అంటే నరకంలానే ఉంటుంది. కానీ రాజమౌళి ఇవన్నీ ఆలోచించకుండా రాజమౌళి తనూ కష్టపడుతూ ఆర్టిస్టులతో కూడా కష్టపడి 24 గంటలు పని చేయిస్తున్నాడట. ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో నటించిన రాణా వ్యాఖ్యలను నిశితంగా పరిశీలిస్తే ఈ విషయం అర్థం అవుతుంది.
Finished my marathon 2nd schedule of #Bahubali days starting from 7A.M. all the way to 10P.M. and the training till midnight..and..
— Rana Daggubati (@RanaDaggubati) August 28, 2013
..the one special weekend wr we shot from Sunday Morning 7AM all the way to Monday morning 8AM an epic shoot little over 24hrs.
— Rana Daggubati (@RanaDaggubati) August 28, 2013
Great team and great energy. Now you know why i wasnt tweeting. ;)
— Rana Daggubati (@RanaDaggubati) August 28, 2013
ఈ బిజీ షెడ్యూల్ వల్లనే ఈ మధ్య రాణా ట్విట్టర్లో యాక్టివ్‌గా లేక పోయాడట. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, అనుష్క, రమ్య కృష్ణ, సత్యరాజ్, నాజర్, అడవి శేషు, సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో షూట్ చేస్తున్నారు. హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది.