twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహా బాహుబలి: రెండు పార్టులూ ఒకే సినిమా గా ఇంగ్లీష్ లో

    ‘బాహుబలి: ది బిగినింగ్’ను.. ‘బాహుబలి: ది కంక్లూజన్’ను కలిపి ఒక ఇంటర్నేషనల్ వెర్షన్ రెడీ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు.

    |

    నిజానికి అసలు బాహుబలి మొదలు పెట్టేనాటికి రెండు భాగాలు అన్న ఆలోచన లేనే లేదు.. కానీ మొదలయ్యాక పెట్టినీ ఖర్చూ, తీసిన పుటేజ్ రెండూ భారీగానే ఉన్నాయని అర్థమయ్యింది అందుకే సినిమాని రెండు పార్టులుగా చేసుకున్నారు. భారీ బడ్జెట్ సినిమా అవడం.. కథలో వెసులుబాటు ఉండటం.. మార్కెటింగ్ స్ట్రాటజీ లని బేరీజు వ్వేసుకున్న జక్కన్న బాహుబలిని బిగినింగ్, కంక్లూజన్ లు గా విడదీసాడు. అదీ ఊహించిన దానికన్నా భారీగానే హిట్టయ్యింది.

    వేర్వేరు సినిమాలు కావు

    వేర్వేరు సినిమాలు కావు

    "ఫస్ట్ పార్ట్‌కి వచ్చిన స్పందన ఆధారంగా సెకండ్ పార్ట్ ప్లాన్ చేసుకోవడానికి ఇవి రెండూ వేర్వేరు సినిమాలు కావు. బాహుబలి అనే సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కించాలి అని ముందుగానే డిసైడ్ చేసుకున్నాం. రెండు భాగాలు కలిపి అంతా ఒకటే స్టోరీ కాబట్టి మొదటి భాగానికి కొనసాగింపుగా రెండో భాగం వుంటుంది.

    రాజమౌళి చెప్పిన సమాధానం

    రాజమౌళి చెప్పిన సమాధానం

    సెకండ్ పార్ట్‌లో అదనంగా విజువల్ ఎఫెక్ట్స్‌ని జోడించడం, అదనపు బడ్జెట్‌ని కేటాయించడం జరిగింది కానీ అంతకు మించి ఇంకా ఎటువంటి మార్పులు చేయలేదు." బాహుబలి ది కంక్లూజన్ కి ముందు ఒక పత్రిక కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మొదటి భాగానికి వచ్చిన ఆదరణను బట్టే రెండో కథలో మార్పులేమైనా చేసారా? అన్న ప్రశ్నకు రాజమౌళి చెప్పిన సమాధానం ఇది....

    రెండు భాగాల్ని కలిపి

    రెండు భాగాల్ని కలిపి

    ఇప్పటివరకు ఇదంతా బాగానే ఉన్నా.. ఇప్పుడు మాత్రం బాహుబలి రెండు భాగాల్ని కలిపి ఒక సినిమాగా కుదించడానికి సన్నాహాలు జరుగుతుండటం విశేషం. ‘బాహుబలి' రెండు భాగాల్ని కలిపి ఒక సినిమాగా కుదించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ‘బాహుబలి: ది బిగినింగ్'ను.. ‘బాహుబలి: ది కంక్లూజన్'ను కలిపి ఒక ఇంటర్నేషనల్ వెర్షన్ రెడీ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు.

     రెండున్నర గంటల నిడివి

    రెండున్నర గంటల నిడివి

    అసలు గత ఏడాదే బాహుబలి ది బిగినింగ్ ను ఓ హాలీవుడ్ ఎడిటర్ సాయంతో ఎడిట్ చేసి రిలీజ్ చేసినా అది ఇంగ్లిష్ వెర్షన్ కాదు. అందుకే ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ఎడిటర్ల సాయంతో మొత్తంగా దాదాపు 5 గంటల 20 నిమిషాల నిడివి ఉన్న రెండు భాగాలను కలిపి రెండున్నర గంటల నిడివికి కుదించనున్నారట. దీనికోసం రెండు భాగాల్లోని పాటలతో పాటు అనవసరం అనుకున్న కొన్ని సీన్స్ ను తీసేసి ఈ ఇంటర్నేషనల్ వెర్షన్ ను రెడీ చేయబోతున్నారు.

    ఇంగ్లిష్ ‘బాహుబలి’

    ఇంగ్లిష్ ‘బాహుబలి’

    ఇలా అంతర్జాతీయ స్థాయిలో పేరు మోసిన ఎడిటర్ల సాయంతో ఈ వెర్షన్ ను ఇంగ్లిష్ లోకి అనువాదం చేసి.. దాన్ని పలు దేశాల్లో రిలీజ్ చేస్తారట. ఇప్పటికే ‘బాహుబలి' రెండు భాగాలు విడుదలైన దేశాలతో పాటు మరిన్ని దేశాల్లో బాహుబలి ఇంగ్లిష్ వెర్షన్ రిలీజవుతుందని సమాచారం.

    English summary
    Makers of Baahubali are hoping that their film would get a similar reception in international markets if they release the compiled form of two films merging into one in English language and release the same in various countries in this year only.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X