రాజమౌళి అడిగితే అన్ని ఇచ్చేస్తా... అదంతా నాన్సెన్స్ అంటున్స సమంత
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత ప్రస్తుతం 'యూటర్న్' అనే మూవీలో బిజీగా గడుపుతోంది. గతేడాది నాగ చైతన్యను పెళ్లాడిన ఈ చెన్నై బ్యూటీ త్వరలో పిల్లలను కనాలని ప్లాన్ చేసుకుంటోందని, సినిమాలకు దూరం కాబోతోందనే వార్తలు సైతం వినిపించాయి. ఆ కారణంగానే రాజమౌళి తను తీయబోయే సినిమాలో ఆఫర్ ఇస్తే నో చెప్పినట్లు తాజాగా మరో వార్త ప్రచారంలోకి వచ్చింది.
ఈ వార్తలపై సమంత స్పందించారు. రాజమౌళి అడిగితే తన వద్ద ఉన్న డేట్స్ అన్నీ ఇచ్చేస్తానని, ఆయన వద్ద నుండి తనకు ఏ ఆఫర్ రాలేదని, తాను రిజక్ట్ చేసినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తెలిపారు.

రాజమౌళి త్వరలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రధారులుగా #ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేయబోతున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు అవసరం. ఒక హీరోయిన్‌గా సమంతను తీసుకోవాలని రాజమౌళి ప్లాన్ చేశారని, అయితే సమంత నో చెప్పినట్లు ఓ పత్రికలో పేర్కొనడంతో సమంత పై విధంగా రియాక్ట్ అయ్యారు.
గతంలో సమంత రాజమౌళి దర్శకత్వంలో ఈగ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. తన కెరీర్లో అపజయం అంటూ ఎరుగని రాజమౌళి... బాహుబలి లాంటి భారీ చిత్రాలు తీసి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెల్లాడు. అలాంటి టాప్ డైరెక్టర్ సినిమాలో అవకాశం అంటే ఏ హీరోయన్ మాత్రం నో చెబుతుంది?


Click it and Unblock the Notifications











