మహేశ్‌బాబుతో సినిమా కన్ఫర్మ్.. ఎన్నో భాషల్లో చెప్పలేను.. రాజమౌళి
బాహుబలి లాంటి సంచలన సినిమాల తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించే చిత్రం గురించి కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు. బాహుబలి తర్వాత రాజమౌళి క్రేజ్ సరిహద్దులు దాటింది. దాంతో ఆయన రూపొందించే సినిమాపై భారీగా ఆసక్తి పెరిగింది. అయితే తాజా రిపోర్టుల ప్రకారం రాజమౌళి ఇద్దరు నిర్మాతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కన్ఫర్మ్ అయింది. ఆ వివరాలు ఇదిగో..

తర్వాత సినిమాపై రాజమౌళి క్లారిటీ
బాహుబలి సినిమా తర్వాత వచ్చే చిత్రంపై సంచలన దర్శకుడు రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. ముందస్తు అంగీకారం ప్రకారం నా సినిమా నిర్మాత దానయ్య రూపొందిస్తారు. అయితే ఎన్ని భాషల్లో వస్తుందో ఇప్పుడే చెప్పలేను. ఆ చిత్రం సోషల్ డ్రామాగా రూపొందుతుంది అని అన్నారు.

నటీనటులు ఎవరన్నది..
దానయ్య నిర్మించే సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరన్నది ఇప్పుడే వివరించలేను. కానీ నా తదుపరి సినిమా ఖచ్చితంగా దానయ్యతో ఉంటుంది అని రాజమౌళి ఇటీవల జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ప్రిన్స్ మహేశ్‌బాబుతో సినిమా చేస్తాను
దానయ్యతో సినిమా ముగింపు తర్వాత ప్రిన్స్ మహేశ్‌బాబుతో సినిమా చేస్తాను అని రాజమౌళి ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఈ చిత్రానికి నిర్మాతగా కేఎల్ నారాయణ వ్యవహరిస్తారు. 2019లో మహేశ్‌బాబు సినిమా సెట్స్ పైకి వెళ్తుంది అని రాజమౌళి చెప్పారు.

బాహుబలి తర్వాత పెరిగిన క్రేజ్
2015లో వచ్చిన బాహుబలి, 2017లో రిలీజైన బాహుబలి1, బాహుబలి2 చిత్రాల తర్వాత రాజమౌళి కెరీర్ గ్రాఫ్ రివ్వున దూసుకుపోయింది. ప్రపంచవ్యాప్తంగా బాహుబలి1 650 కోట్లు, బాహుబలి2 చిత్రం 1725 కోట్లు కొల్లగొట్టింది. ఈ చిత్రం తర్వాత రాజమౌళి జాతీయ స్థాయిలో టాప్ డైరెక్టర్‌గా మారిపోయారు.


Click it and Unblock the Notifications











