Oscars 2023 వేదికపై మెరిసిన దీపిక పదుకోన్.. నాటు నాటుతో రాహుల్ సిప్లిగంజ్ రచ్చ
ప్రపంచ సినిమాలో నోబెల్ అవార్డుగా భావించే ఆస్కార్ 2023 వేదికపై RRR చిత్రం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ వేడుకల్లో RRR టీమ్ మొత్తం పాల్గొన్నది. అయితే ఈ అవార్డుల వేడుకల్లో ఇండియన్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్ ప్రత్యేక ఆకర్షణగా మారారు. వేదికపైన భారతీయ సినిమా RRR సృష్టించిన సంచలనం గురించి ప్రశంసలు గుప్పించారు. ఈ వేడుకలో దీపిక పదుకోన్ ఏం చెప్పారంటే..
భారతీయ సినిమా చరిత్రలోనే కాకుండా, సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో ఓ పాట మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించింది. ఆ నాటు పాట గురించి మీకు తెలియకపోతే.. సినిమా గురించి ఏమీ తెలియదన్నట్టే. నాటు నాటు పాట అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. ఆ పాటకు సంబంధించిన లైవ్‌ను వేదికపైన చూసే అవకాశం మీ కోసం అంటూ దీపిక చెప్పింది.

ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులను ఆకట్టుకొన్న నాటు నాటు పాటను లైవ్‌గా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ప్రదర్శించారు. రాహుల్ పాడుతుండగా విదేశీ డ్యాన్సర్లు స్టెప్పులేసి స్టేజ్ మీద హంగామా చేశారు. ఈ పాట అందర్నీ విజిల్స్ వేసే చేసింది. రాహుల్ సిప్లిగంజ్ ఈ వేదికపై ప్రత్యేక ఆకర్షణగా మారారు.


Click it and Unblock the Notifications











