షాకింగ్‌గా RRR Motion Poster వ్యూస్.. ఏ భాషలో ఎంతెంతంటే..
ఎప్పుడెప్పుడా అని ఎదుచు చూస్తున్న సినీ ప్రేక్షకులకు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఉగాది కానుకగా RRR టీజర్‌ను అందించారు. దాంతోపాటు టైటిల్‌ను ప్రకటించేశారు. రౌద్రం, రణం, రుధిరం అనే టైటిల్‌ను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లారు. తాజాగా విడుదలైన పలు భాషల టీజర్ల వ్యూస్ షాకింగ్‌గా ఉన్నాయి. యూట్యూబ్‌లో అధికార అకౌంట్లకు సంబంధించి ఏ భాషలో ఎన్నెన్ని వ్యూస్ వచ్చాయంటే..

మలయాళంలో
మలయాళం భాషలో విడుదలైన టీజర్‌కు ఓ మాదిరి రెస్పాన్స్ కనిపించింంది. 24 గంటల్లో సుమారు 4 లక్షల వ్యూస్‌కు చేరువైంది. కేరళలో ఎక్కువగా కరోనా ప్రభావం ఉండటం కారణంగా తక్కువగా రెస్పాన్స్ రావడానికి కారణమని చెప్పుకొంటున్నారు.

కన్నడ భాషలో
మలయాళంలో పరిస్థితి కంటే కన్నడలో ఎక్కువగా రెస్పాన్స్ కనిపించింది. తెలుగువాళ్లు కన్నడ రాష్ట్రంలో ఉండటం వల్ల సుమారు 1 మిలియన్ వ్యూస్‌కు చేరువైంది. గత 24 గంటల్లో 952,277 వ్యూస్‌ను సొంతం చేసుకొన్నది.

తమిళంలో
ఇక తమిళంలో RRR మోషన్ పోస్టరకు ఓ రేంజ్‌లో రియాక్షన్ కనిపించింది. 24 గంటలకుపైగా సమయంలో 6 లక్షలకుపైగా వ్యూస్‌ను మాత్రమే సాధించింది. అయితే అనుకొన్నంత మేరకు స్పందన కనిపించకపోవడానికి కారణం కరోనా పరిస్థితే అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

తెలుగులో
RRR టీజర్, టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోకు తెలుగులో భారీ స్పందన వ్యక్తమైంది. ఈ టీజర్ గత 24 గంటల సమయంలో 5 మిలియన్లకుపైగా వ్యూస్‌ను సాధించింది. గురువారం సాయంత్రం వరకు 5,087,900 వ్యూస్ సాధించింది.

RRR మోషన్ పోస్టర్
డీవీవీ దానయ్యకు సంబంధించిన యూట్యూబ్ అకౌంట్‌లో RRR మోషన్ పోస్టర్‌కు భారీ స్పందన కనిపించింది. గత 24 గంటల్లో సుమారు 5 మిలియన్ల వ్యూస్‌కు చేరువైంది. గురువారం సాయంత్రం వరకు 4,392,749 వ్యూస్‌ను నమోదు చేసింది.


Click it and Unblock the Notifications











