RRR సినిమాకు ఐదోసారి షాక్.. SS Rajamouli వెంటాడుతున్న ఆ భయం!

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన RRR సినిమా రిలీజ్‌కు సంబంధించిన వాయిదాల పర్వం కొనసాగుతున్నది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని జక్కన విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే తాను ఒకటి తలచితే.. విధి ఒకటి తలచిందనే చందాన RRR సినిమాను వాయిదా వేశారు. దేశవ్యాప్తంగా నెలకొన్న కోవిడ్ పరిస్థితుల కారణంగా రాజమౌళి టీమ్ వెనుకకు తగ్గక తప్పలేదు. RRR సినిమాకు సంబంధించిన వాయిదాల వెనుక కారణాల్లోకి, పరిస్థితుల్లోకి వెళితే..

పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్

పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్

RRR సినిమా ప్యాన్ ఇండియాగా తెరకెక్కడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాల్సి వస్తున్నది. ఢిల్లీ, యూపీ, మహారాష్ట్రతోపాటు పలు రాష్ట్రాల్లో కోవిడ్ ఆంక్షలు కొనసాగుతున్నాయి మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, యూపీ ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించడం, సినిమా హాల్స్, మాల్స్ మూత పడటంతో RRRకు షాక్ తగిలింది. మహారాష్ట్రతోపాటు పలు రాష్ట్రాల్లో కఠిన నిబంధనలతోపాటు ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించడంతో వినోద పరిశ్రమకు అడ్డంకిగా మారింది.

ఐదుసార్లు సినిమా రిలీజ్

ఐదుసార్లు సినిమా రిలీజ్

RRR సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 5 సార్లు రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. అయితే ఐదుసార్లు వివిధ కారణాల వల్ల RRR ను వాయిదా వేశారు. తాజాగా మరోసారి కరోనావైరస్ ధాటి పెరగడంతో ఈ సినిమా మరోసారి వెనుకకు తగ్గింది. దీంతో RRR రిలీజ్ ఎప్పుడు అవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్నది.

భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ మీడియాలో

భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ మీడియాలో

RRR సినిమా రిలీజ్ వాయిదా పడటంతో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకొన్నాయి. RRR కారణంగా వాయిదా పడిన భీమ్లా నాయక్ రిలీజ్ విషయం మీడియాలోను, సోషల్ మీడియాలోను ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. అయితే భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే విషయంపై సందిగ్ధత నెలకొన్నది.

 RRR మూవీ స్పందన ఏమిటంటే?

RRR మూవీ స్పందన ఏమిటంటే?

RRR సినిమా వాయిదాపై యూనిట్‌ స్పందిస్తూ.. సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి అవిశ్రాంతంగా ప్రయత్నించాం. కొన్ని పరిస్థితులు మా చేతుల్లో, అదుపులో లేకపోయాయి. చాలా రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడుతున్నాయి. దాంతో సినిమా రిలీజ్ విషయంలో మాకు మరో చాయిస్ లేకపోయింది. మీ ఎక్సైట్‌ ఇలాగే కొనసాగుతుందనే ఆశాభావంతో ఉన్నాం. ఇండియన్ సినిమా ప్రతిష్టను మళ్లీ వెనుకకు తీసుకొస్తామని హామీ ఇస్తున్నాం. సరైన సమయంలో RRRతో మీ ముందుకు వస్తాం అని యూనిట్ ఓ ప్రకటన విడుదల చేసింది.

అడ్వాన్స్ బుకింగ్ డబ్బు వాపస్

అడ్వాన్స్ బుకింగ్ డబ్బు వాపస్


RRR సినిమా రిలీజ్ వాయిదా పడటంతో అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ చేసుకొన్న వారికి డబ్బు వాపసు చేస్తున్నారు. ముందస్తుగా వసూలైన 2 మిలియన్ల డాలర్లను ప్రేక్షకులకు తిరిగి ఇచ్చేస్తున్నారు. దాదాపు 70 వేల టికెట్లకు డబ్బులు చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ప్రేక్షకుల్లో నిరాశ, నిస్పృహలు అలుముకొన్నాయి.

 ఏప్రిల్ లేదా జూలైలో రిలీజ్

ఏప్రిల్ లేదా జూలైలో రిలీజ్

అయితే RRR మూవీ ఏప్రిల్ 14వ తేదీన గానీ, జూలై 29వ తేదీన రిలీజ్ అయ్యే అవకాశం ఉందనే ఊహగానాలు ట్రేడ్ వర్గాల్లో కొనసాగుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ వాయిదా పడటంతో భీమ్లా నాయక్‌తోపాటు ఆచార్య, డీజే టిల్లు, రౌడీబాయ్స్ సంక్రాంతి బరిలోకి దూకే ఛాన్సులు భారీగా కనిపిస్తున్నాయి. అయితే భీమ్లా నాయక్, ఆచార్య విడుదల అవుతాయా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఇక ఏప్రిల్, జూలైలో RRR రిలీజ్‌కు సిద్దమైతే.. ఇతర సినిమాల రిలీజ్ డేట్స్ పోటీగా మారే అవకాశం ఉంది. దీంతో భారీ గందరగోళమే కనిపిస్తున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X