‘RRR’ రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రెస్ మీట్, గుడ్‌లక్ చెప్పిన ఉపాసన!
Recommended Video

రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న మల్టీ స్టారర్ మూవీ 'ఆర్ఆర్ఆర్' సినిమా విషయంలో ప్రచారంలోకి వచ్చిన రూమర్స్, అభిమానుల్లో అనుమానాలకు చెక్ పెట్టేందుకు రాజమౌళి అండ్ టీమ్ గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ ప్రెస్ మీట్లో రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో పాటు నిర్మాత డివివి దానయ్య పాల్గొన బోతున్నారు. ఈ ప్రెస్ మీట్లో సినిమా టైటిల్, హీరో హీరోయిన్, ఇతర తారాగణం.. కథకు సంబంధించిన అంశాలు వెల్లడించబోతున్నట్లు తెలుస్తోంది.
గుడ్ లక్ చెబుతూ ఉపాసన ట్వీట్
‘ఆర్ఆర్ఆర్' ప్రెస్ మీట్లో పాల్గొనేందుకు రామ్ చరణ్ ఇంటి నుంచి బయల్దేరిన ఫోటోను ఉపాసన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి ఉపాసన శుభాకాంక్షలు తెలియజేశారు.

రూమర్లకు తెర దించడానికే...
రాజమౌళి అండ్ టీమ్ మీడియా ముందుకు రావడానికి ఈ సినిమా హీరోయిన్ ఎంపిక విషయంలో జరిగిన రచ్చే. జాతీయ మీడియాలో సైతం ఇందుకు సంబంధించిన వార్తలు వచ్చాయి. అలియా భట్ కోసం రాజమౌళి చాలా ప్రయత్నాలు చేశారని, అయితే డేట్స్ ఖాళీ లేక పోవడంతో ఆమె అతడి ఆఫర్ తిరస్కరించిందని, దీంతో అతడు డబ్బు ఎక్కువ ఆఫర్ చేశారని... దానికి అలియా భట్ ఘాటుగా తాన డబ్బు మనిషిని కాదంటూ రిప్లై ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.

టైటిల్ ప్రకటించబోతున్నారా?
‘ఆర్ఆర్ఆర్' అనేది వర్కింగ్ టైటిల్ మాత్రమే. ఈ ప్రెస్ మీట్లో సినిమా పూర్తి టైటిల్ ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి సినిమా అంటేనే ప్రత్యేకంగా ఉంటుంది. మరీ ఈ భారీ మల్టీస్టారర్ టైటిల్ ఎలా ఉండబోతోందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఆర్ఆర్ఆర్
ఈ ప్రాజెక్టు విషయంలో అభిమానులు, మీడియా వారిలో నెలకొని ఉన్న సందేహాలకు రాజమౌళి చెక్ పెట్టబోతున్నారు.


Click it and Unblock the Notifications











