twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జోరుగా RRR షూట్.. కేకపుట్టించేలా ఫైట్.. మాస్‌గా ఎన్టీఆర్.. చెర్రీ లుక్ ఎలా ఉందంటే

    |

    బాహుబలి మూవీ తర్వాత దర్శక ధీర రాజమౌళి రూపొందిస్తున్న RRR చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. హైదరాబాద్‌ పరిసర ప్రాంతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్‌పై సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమా సీన్లకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. వివరాల్లోకి వెళితే..

    మాస్ లుక్‌తో జూ ఎన్టీఆర్

    మాస్ లుక్‌తో జూ ఎన్టీఆర్

    RRR‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ పాత్రలో నటిస్తున్నారట. ఇటీవల పఠాన్ దుస్తులు ధరించిన తారక్‌ మాస్ పాత్రలో కనిపించారట. గుబురు గడ్డంతో ఓ కొత్త లుక్‌తో షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమా కోసం తన గెటప్ విషయంలో కొత్తగా కనిపించేందుకు జిమ్ ట్రైనర్‌ను రప్పించిన సంగతి తెలిసిందే.

     మాడ్రన్ గెటప్‌లో రాంచరణ్

    మాడ్రన్ గెటప్‌లో రాంచరణ్

    ఇక రాంచరణ్‌ మోడ్రన్ డ్రస్‌లో షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఆధునికత ఉట్టిపడేలా దుస్తులు ధరించి ఇటీవల షూటింగ్‌లో పాల్గొనగా చెర్రీపై కొన్ని సీన్లను చిత్రీకరించినట్టు తెలిసింది.

     రాంచరణ్, ఎన్టీఆర్ మధ్య ఫైట్

    రాంచరణ్, ఎన్టీఆర్ మధ్య ఫైట్

    RRR‌ తొలి షెడ్యూల్‌లో భాగంగా రాంచరణ్, ఎన్టీఆర్ మధ్య ఓ వాటర్ ఫైట్‌ను ఇటీవల తీశారట. ఈ సినిమాలో కీలక సన్నివేశంగా వచ్చే పవర్‌ఫుల్ ఫైట్‌ను జక్కన్న భారీగా చిత్రీకరించారట. ఈ సినిమాలో హైలెట్‌గా నిలిచే సీన్లలో ఇది ఒకటిగా పేర్కొంటున్నారు.

     మూడు కాళ్ల బంధం

    మూడు కాళ్ల బంధం

    తొలి షెడ్యూల్‌లో సన్నివేశాల చిత్రీకరణ సందర్భంగా ముగ్గురు కాళ్లను ఫొటో తీసి జూనియర్ ఎన్టీఆర్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దాంతో సోషల్ మీడియాలో ఈ ఫొటో ట్రెండ్ అవుతున్నది. ఇప్పటికే ఈ ఫొటోకు సుమారు 6 లక్షల లైక్స్ రావడం గమనార్హం.

    హీరోయిన్లుగా

    హీరోయిన్లుగా

    RRR‌ మూవీ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండే అవకాశం ఉంది. ఈ సినిమాలో హీరోయిన్లుగా కీర్తి సురేష్, రష్మిక మందన్న, పూజా హెగ్డే పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇక జాహ్నవి కపూర్‌ను కూడా ఈ సినిమాలో నటింప జేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ కూడా నటిస్తున్నట్టు తెలిసింది.

    <strong>ఊహకందని రాజమౌళి ప్లానింగ్: 2.0 మించేలా ‘ఆర్ఆర్ఆర్', 4డి టెక్నాలజీ, 120 కెమెరాలతో...</strong>ఊహకందని రాజమౌళి ప్లానింగ్: 2.0 మించేలా ‘ఆర్ఆర్ఆర్', 4డి టెక్నాలజీ, 120 కెమెరాలతో...

    200 కోట్లతో దానయ్య

    200 కోట్లతో దానయ్య

    రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందిస్తున్న కథతో RRR‌ మూవీ తెరకెక్కుతున్నది. ఈ చిత్రానికి రామరావణ రాజ్యం అనే పేరును ఖరారు చేసినట్టు సమాచారం. అయితే ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. ఈ చిత్రాన్ని రూ.200 కోట్లతో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొందిస్తున్నారు.

    English summary
    Director SS Rajamouli is shooting for his next after Baahubali series. The film, titled RRR, stars Jr NTR and Ram Charan, and is being produced by DVV Danayya. The story is written by Rajamouli’s father V Vijayendra Prasad, and the music will be composed by MM Keeravani. RRR will be edited by Sreekar Prasad and with Sabu Cyril taking up production designing.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X