అలా వచ్చిన ఆలోచనే RRR..అందుకే రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నా: రాజమౌళి

దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న భారీ సినిమా RRR. చాలా నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేసిన జక్కన్న.. తాజాగా ఓ బాలీవుడ్ మీడియాతో ముచ్చటిస్తూ ఈ సినిమా రూపొందించాలనే ఆలోచన ఎలా వచ్చిందో చెప్పారు. వివరాల్లోకి పోతే..

ఆకాశాన్నంటే ఆశల నడుమ RRR

ఆకాశాన్నంటే ఆశల నడుమ RRR

డీవీవీ దానయ్య నిర్మాణంలో భారీ బడ్జెట్ కేటాయించి RRR మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కొమురం భీమ్ రోల్ ఎన్టీఆర్ పోషిస్తుండగా, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. 1920 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాపై జనాల్లో ఆకాశాన్నంటే ఆశలున్నాయి.

మెగా, నందమూరి ఫ్యాన్స్‌కి పండగే..

మెగా, నందమూరి ఫ్యాన్స్‌కి పండగే..

ఇక ఈ భారీ మూవీలో ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలు అబ్బుర పరుస్తాయని టాక్. ఎన్టీఆర్ అయితే ఏకంగా మూడు పాత్ర‌ల్లో క‌న‌ప‌డ‌నున్నార‌ని తెలుస్తోంది. అయితే ఆ లుక్స్ ఎలా ఉంటాయ‌నేది మాత్రం తెలియాలంటే మాత్రం సినిమా విడుద‌ల వ‌ర‌కు ఆగాల్సిందే అంటున్నారు.

RRR మోషన్ పోస్టర్.. భారీ రెస్పాన్స్

RRR మోషన్ పోస్టర్.. భారీ రెస్పాన్స్

కరోనా ఎఫెక్ట్ కారణంగా తదుపరి షెడ్యూల్స్ వాయిదా వేసిన చిత్రయూనిట్.. ఇటీవలే RRR మోషన్ పోస్టర్ విడుదల చేసి అభిమానుల్లో ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. ఈ పోస్టర్‌కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ రావడమే గాక.. పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు దక్కుతున్నాయి.

అలా వచ్చిన ఆలోచనే RRR

అలా వచ్చిన ఆలోచనే RRR

కాగా RRR సినిమా రూపొందించడం వెనుక ఓ సీక్రెట్ ఉందని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు రాజమౌళి. తన చిన్నప్పుడు సూపర్‌మేన్, స్పైడర్‌మేన్ లాంటి కామిక్ పుస్తకాలు చదివానని, ఆ టైమ్ లో వాళ్లిద్దరు కలిస్తే బాగుంటుందని అనిపించిందని.. అలా వచ్చిన ఆలోచనేతోనే ఈ RRR మొదలు పెట్టడం జరిగిందని చెప్పారు.

Recommended Video

RRR | Audience Blown Away By Jr NTR Voice Over
నిజజీవితంలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌..

నిజజీవితంలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌..

అన్నీ కలిసి రావడంతో రామ్ చరణ్, ఎన్టీఆర్‌ లతో RRR సినిమా చేస్తున్నానని అన్నారు జక్కన్న. నిజజీవితంలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌ మంచి స్నేహితులని, వారి
స్నేహ బంధం ఈ సినిమాకు ఉపయోగపడుతోందని అన్నారు. ఇటీవల విడుదల చేసిన మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X