వైభవంగా ఎస్ఎస్ కార్తికేయ వివాహం, పెళ్లి కూతురును పల్లకిలో తీసుకొచ్చిన ప్రభాస్ (ఫోటోస్)
దర్శకుడు రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ పెళ్లి పూజతో వైభవంగా జరిగింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ వివాహ మహోత్సవానికి జైపూర్లోని ఫైవ్ స్టార్ హోటల్ వేదికైంది. టాలీవుడ్ సినీ స్టార్స్ నాగార్జున, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, రానా, నాని, అనుష్కతో పాటు పలువురు స్టార్స్ ఈ వేడుకలో సందడి చేశారు.
పెళ్లి వేడుకలో ప్రభాస్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. పెళ్లి పెద్దల్లో ఒకరిగా వ్యవహరిస్తూ వధువు పూజను మండపం వద్దకు పల్లకిలో తీకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వధువు పూజ ప్రముఖ టాలీవుడ్ నటుడు జగపతి బాబు అన్నయ్య రాంప్రసాద్ కూతురు అనే విషయం తెలిసిందే.

కార్తికేయ-పూజ
కాక్తికేయ, పూజ వివాహం కుటుంబ సభ్యులు, టాలీవుడ్ సినీస్టార్స్ సమక్షంలో వైభవంగా సాగింది. ఇద్దరూ కలిసి దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నామనే సంతోషంలో సిగ్గుమొగ్గయ్యారు.

జీలకర్రబెల్లం
పెళ్లి వేడుకలో అతిముఖ్యమైన ఘట్టం జీలకర్ర బెల్లం. పెళ్లి ముహూర్తం అంటే జీలకర్ర, బెల్లం పెట్టే సమయమే. అందుకే ‘'ధ్రువంతే రాజావరుణో ధ్రువందేవో బృహస్పతిః, ధ్రువంత ఇన్ద్రశ్చాగ్నిశ్చ రాజ్యం ధారయతాం ధ్రువమ్" వంటి మంగళప్రదమైన మంత్రాలను ఈ సందర్భంలో చదువుతారు.

అరుంధతీ నక్షత్రం
పెళ్లి వేడుకలో మరో ముఖ్యమైన ఘట్టం నూతన దంపతులకు అరుంధతీ నక్షత్రం చూపించడం. మొదట ధ్రువ నక్షత్రాన్ని తరువాత అరుంధతీ నక్షత్రాన్ని వారికి చూపిస్తారు. ధ్రువ నక్షత్రం లాగ వారు నిలకడ అయిన మనస్తత్వాలతో స్థిరంగా ఉండాలని, అలాగే వధువు అరుంధతి లాగా మహాపతివ్రతగా మనుగడ సాగించాలనే ఆకాంక్ష ఈ ప్రక్రియలో కనిపిస్తుంది.

రామ్ చరణ్-ఉపాసన
పెళ్లి వేడుక అనంతరం తమను ఆశీర్వదిస్తున్న రామ్ చరణ్, ఉపాసన దంపతుకు నమస్కరిస్తున్న పూజ-కార్తికేయ.

వెడ్డింగ్ పిక్
వివాహ వేడుక అనంతరం పూజ-కార్తికేయ దంపతులతో ఫోటో దిగిన రామ్ చరణ్-ఉపాసన.
పల్లకిలో వధును తీసుకొచ్చిన ప్రభాస్
వధువు పూజను వివాహ మండపం వద్దకు తీసుకొచ్చే ఘట్టంలో పాల్లొన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిగా కలిసిపోయి ఈ వేడుకలో సందడి చేశారు.
Poll: ఉత్తమ విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు 2018

పెళ్లి మండపం డిజైన్ అదుర్స్
రాజమౌళి సినిమాల్లో సెట్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక మరి తన కుమారుడి వివాహంలో ఎలాంటి శ్రద్ధ తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లుదు.


Click it and Unblock the Notifications











