నా డెస్టినేషన్ వెడ్డింగ్ ఎక్కడంటే.. అఖిల్ కెరీర్‌ను నాశనం చేయలేను.. కార్తీకేయ

Recommended Video

SS Karthikeya Talks About Akhil

ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తీకేయ పెళ్లి గురించి మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. తన పెళ్లి గురించి కార్తీకేయ కొంత క్లారిటీ ఇచ్చారు. కార్తీకేయ నిశ్చితార్తం జగపతిబాబు సోదరుడు రాంప్రసాద్ కుమార్తె పూజా ప్రసాద్‌తో జరిగిన విషయం తెలిసిందే. త్వరలోనే పెళ్లి జరుగుతుంది. దాని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకా వివాహ వేదిక ఎక్కడ అనేది డిసైడ్ కాలేదని చెప్పారు. అలాగే తన స్నేహితుడు అఖిల్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. కార్తీకేయ ఏం చెప్పారంటే...

 ఆరేళ్ల క్రితం పూజాతో లవ్

ఆరేళ్ల క్రితం పూజాతో లవ్

పూజతో నా ప్రేమ ఆరేళ్ల క్రితం మొదలైంది. మా ఇద్దరి అభిరుచులు వేరు. కానీ ఒకరి అభిరుచిపై మరొకరు అభినందించుకొంటాం. నేను హైపర్‌గా ఉంటాను. ఆమె చాలా కామ్‌గా ఉంటాను. అందుకే మా ఇద్దరి మధ్య ఒకరకమైన, బ్యాలెన్స్‌తో రిలేషన్ ఏర్పడింది.

 డెస్టినేషన్ వెడ్డింగ్‌గా వివాహం

డెస్టినేషన్ వెడ్డింగ్‌గా వివాహం

మా వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరుగుతుంది. ఇంకా ఎక్కడ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి రాలేదు. ప్లేస్ ఎక్కడ అనేది నిర్ణయించుకోలేదు. బేసిక్‌గా పూజ కలువకముందే నా వివాహాన్ని డెస్టినేషన్ వెడ్డింగ్‌గా చేసుకోవాలని అనుకొన్నాను.

కూర్గ్, చిక్‌మంగుళూరులో

కూర్గ్, చిక్‌మంగుళూరులో

నాకు హిల్ స్టేషన్, బీచ్‌లంటే చాలా ఇష్టం. ఈ రెండు రకాల ప్రదేశాల్లో ఏదో ఒక ప్రదేశంలో జరుగుతుంది. ముఖ్యంగా హిల్స్ స్టేషన్‌లోనే జరుగుతుంది. కూర్గ్ గానీ, చిక్‌మంగుళూరులో ఎక్కడైనా జరుగవచ్చు. ఇంకా వివాహ వేదికపై నిర్ణయానికి రాలేదు అని చెప్పారు.

అఖిల్‌ అక్కినేనితో సినిమా గురించి

అఖిల్‌ అక్కినేనితో సినిమా గురించి

అఖిల్ నేను క్లోజ్ ఫ్రెండ్స్. అతడి సినిమాకు డైరెక్షన్ చేస్తారా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. అఖిల్ కెరీర్‌ను నాశనం చేయదలానుకొంటే నేను డైరెక్షన్ చేయాలి. ఒకవేళ చేయాల్సి వస్తే.. ప్రస్తుతం దర్శకుడు వెంకీ అట్లూరి చేస్తున్న సినిమా లాంటి చిత్రాన్ని చేస్తాను. వెంకీ అట్లూరి చేసే సినిమా అఖిల్‌కు సరిగ్గా సరిపోతుంది.

త్వరలో సినిమా గురించి చెప్తా

త్వరలో సినిమా గురించి చెప్తా

నేను ఓ సినిమా చేయాల్సి వస్తే అన్ని జోనర్లను పరిగణనలోకి తీసుకొంటాను. నేను నిర్మాతగా ఆలోచించాల్సి వస్తే ప్రేక్షకుడిగా ఆలోచిస్తాను. నాన్న అస్టిస్టెంట్ అశ్విన్‌తో కలిసి ఓ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను. త్వరలోనే అధికారికంగా వివరాలు వెల్లడిస్తాను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X