‘భాగమతి’ అనుష్కపై రాజమౌళి కామెంట్.. గ్రాఫిక్సా? నిజంగానే..

నవంబర్ 7వ తేదీన అందాల నటి అనుష్క శెట్టి జన్మదినాన్ని పురస్కరించుకొని భాగమతి ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్‌పై విశేష స్పందన వ్యక్తమవుతున్నది.

By Rajababu

Recommended Video

అనుష్కపై రాజమౌళి కామెంట్

బాహుబలి చిత్రాల తర్వాత అనుష్క పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. బాహుబలి ప్రభంజనంలో కొన్ని బాలీవుడ్ అవకాశాలు కూడా వచ్చాయనే వార్తలు కూడా వెలుగు చూశాయి. ఆ తర్వాత ప్రభాస్‌తో అఫైర్, పెళ్లి అంటూ మీడియాలో కథనాలు గందరగోళానికి దారి తీసాయి. ఆ తర్వాత సాహో చిత్రంలో ప్రభాస్‌తో నటించే అవకాశం చేజారింది. తాజాగా అనుష్క చేతిలో ఉన్న ఒకే చిత్రం భాగమతి. నవంబర్ 7వ తేదీని పురస్కరించుకొని భాగమతి ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్‌పై విశేష స్పందన వ్యక్తమవుతున్నది. ఈ ఫస్ట్ లుక్ గురించి ఎస్ ఎస్ రాజమౌళి ట్విట్టర్‌లో ఏమన్నారంటే..

భాగమతి ఫస్ట్ లుక్‌లో అనుష్క..

భాగమతి చిత్రం ఫస్ట్‌లుక్‌ మతిపోయేలా ఉందని ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి అన్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ వేదికగా తెలుపుతూ పోస్టర్‌ను పంచుకున్నారు. టెర్రిఫిక్ భాగమతి
అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు.

ఆకట్టుకొంటున్న అనుష్క

ఆకట్టుకొంటున్న అనుష్క

భాగమతి ఫస్ట్‌లుక్‌లో అనుష్క అభిమానులను విశేషంగా ఆకర్షిస్తున్నారు. ఒక చేతిలో రక్తం మరకలతో కూడిన సుత్తిని పట్టుకొని, మరో చేతికి గాయం కావడంతో కారుతున్న రక్తం భయంకరంగా ఉన్నాయి. ఈ ఫస్ట్‌లుక్‌తో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.

గతంలో కంటే అనుష్క సన్నగా..

గతంలో కంటే అనుష్క సన్నగా..

గతంలో కంటే భాగమతి ఫస్ట్‌లుక్‌లో అనుష్క చాలా సన్నగా కనిపించారు. లావుగా ఉండటం కారణంగా భారీగా ఖర్చు చేసి గ్రాఫిక్స్ ఉపయోగించారు అనే ప్రచారం జరిగింది. అయితే అనుష్క నాజుక్కుగా కనపడటానికి గ్రాఫిక్స్ కారణమా లేక నిజంగానే సన్నపడిందా అనే వాదన వినిపిస్తున్నది.

యూవీ క్రియేషన్స్ బ్యానర్లో

యూవీ క్రియేషన్స్ బ్యానర్లో

భాగమతి సినిమాకు జీ అశోక్ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. సంగీత దర్శకుడు తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. ఉన్ని ముకుందన్‌, ఆది పినిశెట్టి, జయరాం తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవల షూటింగ్‌ పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తమన్నాతో కలిసి అనుష్క

తమన్నాతో కలిసి అనుష్క

బాహుబలి, భాగమతి తర్వాత అనుష్క కొత్త చిత్రాన్ని అంగీకరించిన దాఖలాలు లేవు. అయితే గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం రానున్న ఓ చిత్రంలో తమన్నా భాటియాతో కలిసి నటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఆ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X