twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ 'పంజా' ప్రమోషన్ అసత్యం: రాజమౌళి

    By Srikanya
    |

    ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఎప్పటికప్పుడు తన అభిమానులుకు నిజాలు చెప్పటంలో ముందుంటారు. ఆయన తన ట్విట్టర్ తన సినిమాలపై వస్తున్న న్యూస్ లు కరెక్టు కాకపోతే ఖండిస్తూంటారు. తాజాగా ఆయన తన ఈగ చిత్రంలో వెంకటేష్ తో వాయిస్ ఓవర్ చెప్పిస్తున్నారంటూ వచ్చిన విషయంపై రాస్తూ.. అలాంటిదేమీ లేదని అది పాల్స్ న్యూస్ అని అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పంజాకు ఆయన ప్రమోషన్ చూస్తున్నారంటూ వచ్చిన వార్తలను కూడా కొట్టి పారేస్తూ ట్వీట్ చేసారు.ఇక రాజమౌళి పంజా చిత్రానికి పనిచేస్తున్నారనే వార్త రావటానకి కారణం... అంతకుముందు ఆయన పంజా చిత్రం ఫస్ట్ లుక్ గురించి ట్వీట్ చేయటమే. నిర్మాతలు తమ ఫస్ట్ లుక్ ని దర్శకుడు రాజమౌళికి చూపించారు. అది చూసిన రాజమౌళి తన ట్విట్టర్ లో ఈ విషయమై రాస్తూ...ఇప్పుడే నేను పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూసాను. టెర్రఫిక్. ఫాన్స్ కి పండుగే.. ప్రొడ్యూసర్ శోభు గారు..నాకు ఇధి చూపించారు. త్వరలోనే వీటిని విడుదల చేయబోతున్నారు. విడుదలకు ముందు నేను పోస్ట్ చేయకూడదను ఆగుతున్నాను అన్నారు. ఇక ఈ నిర్మాతలకు రాజమౌళి గతంలో మర్యాదరామన్న చిత్రం రూపొందించారు.

    ఇక ప్రస్తుతం రాజమౌళి నాని,సమంత కాంబినేషన్ లో ఈగ చిత్రం రూపొందిస్తున్నారు.ఆ చిత్రం గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. ఆ చిత్రం బిజెనెస్ వర్గాల్లో అప్పుడే మంచి క్రేజ్ క్రియోట్ చేసింది. సోషియో ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈగ షూటింగ్ లో రాజమౌళి బిజీగా ఉన్నారు. ఆ చిత్రంకి మాటలు రాయటానికి కానూ దర్శక, రచయిత జనార్ధన మహర్షిని తీసుకున్నట్లు తెలుస్తోంది. తమిళ వెర్షన్ కి గానూ క్రేజీ మోహన్ ని తీసుకున్నారు. ఇక ఈగ చిత్రంలో విలన్ గా కన్నడ నటుడు సుదీప్ చేస్తున్నారు..సురేష్ ప్రోడక్షన్ సమర్పణలో ఈచిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకి యం యం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 'ఈగ" సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే 'తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే 'ఈగ" రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో 'ఈగ"గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ 'ఈగ" ఎలా గెలిచిందీ.. ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ" అన్నదే క్లుప్తంగా 'ఈగ" కథాంశం. ఈ చిత్రం తర్వాత ప్రభాస్ హీరోగా ఓ చిత్రం రూపొందించటానికి రాజమౌళి రెడీ అవుతున్నారు.

    English summary
    SS Rajamouli tweets---
 News that venkatesh Garu giving voice over for eega is false. news that I am looking after panja promotion is false.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X