వెబ్ సైట్స్ కు లీగల్ నోటీస్ పంపిన రాజమౌళి
ప్రముఖ దర్శకుడు రాజమౌళి తాజాగా యాకూ డాట్ కాం అనే వెబసైట్ కు లీగల్ నోటీస్ పంపారు. ఆయన తాజా చిత్రం మర్యాదరామన్న కు సంభందించిన ఫ్రీ డౌన్ లోడ్ లింక్ లు ఇచ్చినందుకు ఆయన ఈ లీగల్ నోటీసులు పంపామని, వారు స్పందించి ఆ లింకులు తొలిగించారని చెప్పారు. చైనాలోని బీజింగ్, ఛాయోంగ్ సిటీలలో వెబ్ సైట్స్ మెయిన్ ఆఫీసులు పెట్టి ఇండియన్ సినిమాలను..(తెలుగు సినిమాలుతో సహా) రిలీజైన కొద్ది గంటల్లోనే డౌన్ లోడ్ లింక్ లు పెట్టి మార్కెట్ ని దెబ్బకొడుతున్నారు. దాదాపు తెలుగులో ఈ మధ్య కాలంలో రిలీజైన కొత్త సినిమాలన్నీ ఈ వెబ్ సైట్స్ లో ఉంటాయి. ఇక రాజమౌళి తన మర్యాదరామన్న చిత్రం ఉన్న 83 లింక్ లను ఇప్పటికీ కట్ చేయగలిగారు. వారు లీగల్ నోటీసులు పంపటంతో వారు డౌన్ లోడ్స్ ని ఆపగలిగామన్నారు.
ఇక ఈ చైనా వెబెసైట్స్ కి వీడియో ఫైల్స్ ని ఇస్తూ...ఇక్కడవారే ఎవరో హెల్ప్ చేస్తున్నారని ఆయన అంటున్నారు. చాలా పైరసీ చిత్రాలు బెంగుళూరు,చెన్నై కి పంపుతున్న ప్రింట్ ల నుంచి తయారు చేస్తునన్నారని చెప్పారు. ఎందుకంటే అక్కడ తెలుగు సినిమాల పైరసీ గురించి ఎవరూ పట్టించుకోరు. ఇక మనం కంప్లైంట్ పెట్టి లీగల్ నోటీస్ పంపినా వెబ్ సైట్స్ వారు ఆ డౌన్ లోడ్ లింక్ కట్ చేయటానికి ఇరవై నాలుగు గంటలనుంచి ముప్పై గంటలు వరకూ పడుతుంది. అప్పటికే జరగవలిసిన నష్టం జరిగిపోతోంది. దాదుపు 32.3 శాతం రెవిన్యూ ఈ పైరసీ వల్ల నష్టపోతున్నామని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











