For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుండె పగిలింది, నిజమైన హీరోలు మీరే.. చంద్రయాన్‌పై పూజాహెగ్డే, షారుఖ్, సాయిధరమ్, రాజమౌళి ట్వీట్స్

|

చంద్రయాన్‌2 ప్రయోగానికి సంబంధించి చివరి నిమిషంలో కమ్యూనికేషన్ వ్యవస్థతో సంకేతాలు తెగిపోవడంపై దేశ ప్రజలంతా ఆందోళనకు గురయ్యారు. చిట్టచివరి దశలో ప్రయోగం విఫలం కావడం ప్రతీ దేశ ప్రజలందరినీ గుండె కోతకు గురిచేసింది. చంద్రయాన్2 ప్రయోగాన్ని ఇస్రో సైంటిస్టులు సాధ్యం చేసే తీరుపై పలువురు సినీ ప్రముఖులు తమ సందేశాన్ని వ్యక్తం చేశారు. చంద్రయాన్2 ప్రయోగం విఫలం కావడంపై వారు ఏమని ట్వీట్ చేశారంటే..

 ఆత్మవిశ్వాసం పెరిగింది

ఆత్మవిశ్వాసం పెరిగింది

చంద్రయాన్‌2 ప్రయోగంపై బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ స్పందించాడు. చంద్రయాన్2తో కమ్యూనికేషన్ కోల్పోయామే కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కాదు. ఇస్రో ప్రయత్నాన్ని చూసి గర్వపడుతున్నాం అని సన్నీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

అసాధ్యాన్ని సుసాధ్యం చేసేందుకు

అసాధ్యాన్ని సుసాధ్యం చేసేందుకు

రోదసిలో చరిత్ర సృష్టించేందుకు ఇస్రో చేసిన ప్రయత్నానికి నా అభినందనలు. ఇది ముమ్మాటికి ఫెయిల్యూర్ కాదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసేందుకు ఓ అభ్యాసన. మీ ప్రయత్నానికి జాతి మొత్తం మద్దతుగా నిలిచింది. మీ సేవలను చూసి దేశం గర్విస్తున్నది. నరేంద్రమోదీ నాయకత్వ లక్షణాలకు నా ధన్యవాదాలు అంటూ రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేశారు.

మరింత బలంగా కొట్టాలి

మరింత బలంగా కొట్టాలి

చంద్రుడిపై విక్రమ్ లాండర్ ల్యాండ్ అయ్యే క్షణాలను ఆస్వాదించడానికి అర్ధరాత్రి 2 గంటల సమయంలో వేచి ఉన్నాను. కానీ ఆ చారిత్రతక సంఘటనకు కొన్ని కిలో మీటర్లలో ఆగిపోవడం చంద్రయాన్2 సైంటిస్లుల జట్టుకు గుండెకోతనే. ఆ సందర్భాన్ని చూసి తట్టుకోలేకపోయాను. జాతి గర్వించ దగిన పూనుకొన్న ప్రయోగానికి మీమెంత వెన్నంటి ఉన్నాం. ఇస్రో సేవలు చూసి గర్వపడుతున్నాం. ఈ సారి మరింత బలంగా ప్రయోగానికి సిద్ధం కావాలి అని సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు.

దేవుడికి ఇష్టం లేదేమో

దేవుడికి ఇష్టం లేదేమో

చంద్రయాన్2 ప్రయోగంపప బాలీవుడ్ క్రిటిక్ కేఆర్కే స్పందించారు. చంద్రుడి ఉపరితలంపై కొద్దికిలో మీటర్ల దూరంలో కమ్యూనికేషన్ వ్యవస్థతో సంబంధాలు తెగిపోవడం బాధను కలిగింది. విశ్వంలోని రహస్యాలను మానవులు తెలుసుకోవడం దేవుడికి ఇష్టం లేదేమో అనిపిస్తుంది. మానవులంతా భూమిని పరిరక్షించుకోవడంపై దృష్టిపెట్టాలి అంటూ కేఆర్కే ట్వీట్ చేశారు.

ఫెయిల్యూర్‌లోనూ విజయగర్వం

ఫెయిల్యూర్‌లోనూ విజయగర్వం

భూమి నుంచి చంద్రుడికి మధ్య దూరం 384400 కిలో మీటర్లు. మనం విఫలమైన దూరం 2.1 కిలో మీటర్లు. అతి తక్కువ మార్జిన్‌కు దూరంగా ఆగిపోయాం. ఈ ప్రయోగం విఫలం మరో కొత్త అధ్యాయానికి పునాది. ఈ ఫెయిల్యూర్‌లో కూడా విజయగర్వం ఉంది. ఇస్రో సైంటిస్టులకు నా అభినందనలు అని అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు.

భవిష్యత్‌కు మార్గదర్శకం

భవిష్యత్‌కు మార్గదర్శకం

ఇస్రో చేపట్టిన చంద్రయాన్ ప్రయోగం చూసి గర్వపడుతున్నాం. చాలా రిస్క్ ఉండటం కారణంగానే చంద్రుడిపై సౌత్ పోలార్ ప్రాంతంలో పరిశోధనలు చేపట్టలేదు. ఈ పరిశోధనతలో భారత్ సత్తా తెలిసింది. విశ్వపరిశోధనలో శక్తిమంతంగా అవతరించేందుకు, భవిష్యత్‌లో గొప్ప పరిశోధనలకు మార్గదర్శకంగా ఈ ప్రయోగం మారింది. ప్రయోగాలు చేయడం సైన్స్‌లో తొలిమెట్టు అంంటూ సుధీర్ బాబు ట్వీట్ చేశారు.

చేతులెత్తి నమస్కరిస్తున్నా

చేతులెత్తి నమస్కరిస్తున్నా

గొప్ప లక్ష్యాలను అందుకొనే ప్రయానంలో అవరోధాలు చాలా సర్వసాధారణం. చంద్రుడికి సమీపంలోకి వెళ్లడానికి ఇస్రో సైంటిస్టులు చేసిన విశేష కృషికి జాతితో కలిసి అభినందిస్తున్నాను. మా హృదయాలను గెలుచుకొన్నారు. మీ సేవలకు, ప్రయత్నానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను అని ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్ చేశారు.

నమ్మకమే ముందుకు తీసుకెళ్తుంది

నమ్మకమే ముందుకు తీసుకెళ్తుంది

కొన్నిసార్లు మనం చేరుకోవాలనుకొన్న ప్రదేశాలకు చేరుకోలేకపోతాం. దానికి నిరుత్సాపడకూడదు. మన నమ్మకం, హోప్ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ప్రస్తుత పరిస్థితి ప్రతికూలంగా ఉండవచ్చు. కానీ అదే చివరి మజిలి కాదు. నమ్మకం, సమయం మన లక్ష్యాన్ని చేరుస్తుంది. ఇస్రో ప్రయోగం చూసి గర్వపడుతున్నాను అని షారుక్ ఖాన్ అన్నారు.

 గుండె పగిలేలా చేసింది.

గుండె పగిలేలా చేసింది.

ప్రపంచం గర్విచే గొప్ప ప్రయోగానికి కోసం ఇస్రో సైంటిస్టులు ప్రాణాలు పెట్టేశారు. అలాంటి పరిస్థితుల్లో మన సైంటిస్టులు నిరాశకు గురికావడం నాకు గుండె పగిలేలా చేసింది. ప్రయోగం చివర్లో ఫలితాన్ని ఇవ్వకపోయినా.. ఇస్రో సైంటిస్లులే నిజమైన హీరోలు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసేందుకు ప్రయత్నించిన తీరుకు థ్యాంక్యు అని పూజా హెగ్డే అన్నారు.

English summary
Many bollywood celebraties reacted on Chandrayan 2. They said, #Chandrayan2 Learning is a process and the process is a roller coaster ride. So well done ISRO, you are the star and moon is well within your reach.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more