గ్రాండ్ పార్టీ ఇచ్చిన రాజమౌళి.... వైరల్ అవుతున్న ఫోటోస్, ఎవరెవరు వచ్చారంటే?
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల కోసం గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ వివాహం జనవరి మొదటి వారంలో జరుగనున్న నేపథ్యంలో 'ప్రీ వెడ్డింగ్ బాష్' పేరుతో ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరైనట్లు సమాచారం. అయితే వేడుకకు సంబంధించిన ఫోటోస్ ఏవీ బయటకు రాలేదు. మహేష్ బాబు భార్య నమ్రత పోస్ట్ చేసిన కొన్ని ఫోటోస్ వైరల్ అయ్యాయి.

రమా రాజమౌళితో నమ్రత
రాజమౌళి భార్య రమతో దిగిన ఫోటోస్ నమ్రత పోస్ట్ చేయడంతో ఇది ఎస్ఎస్ కార్తికేయ ప్రీ వెడ్డింగ్ పార్టీకి సంబంధించిన ఫోటోలే అనే ప్రచారం జరుగుతోంది.

మహేష్ బాబు కూడా వచ్చారా?
ఎస్ఎస్ కార్తికేయ ప్రీ వెడ్డింగ్ పార్టీకి మహేష్ బాబు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం అయితే లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోస్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

తమన్నాతో కార్తికేయ-పూజ
కార్తికేయ త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నటుడు జగపతి బాబు అన్నయ్య కూతురు పూజతో కార్తికేయ వివాహం జనవరి 5న జరుగబోతోంది.

ప్రేమ వివాహం
కార్తికేయ, పూజ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల వారు ఒప్పుకోవడంతో పెళ్లికి రంగం సిద్ధమైంది. సెప్టెంబర్లో వీరి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.

రామానాయుడు స్టూడియో వివాహ వేదిక
వీరి పెళ్లి వేడుకకు రామానాయుడు స్టూడియో వేదిక కానుంది. జనవరి 5వ తేదీ సాయంత్రం 6.30 గంటల నుంచి కార్తికేయ, పూజ వివాహమహోత్సవం ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. ఆల్రెడీ రాజమౌళి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది.


Click it and Unblock the Notifications











