రాజమౌళి ఇంట్లో పెళ్లి సందడి.. జగపతి బాబు ఫ్యామిలీతో వియ్యం!

By Rajababu

Recommended Video

Rajamouli Son SS karthikeya Got Engaged With His Girlfriend Pooja Prasad

బాహుబలితో అంతర్జాతీయ ఖ్యాతిని అందుకొన్న ప్రముఖ దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఆయన వివాహం ప్రముఖ నిర్మాత, దర్శకుడు దివంగత 'జగపతి' రాజేంద్రప్రసాద్ కుమారుడు రాంప్రసాద్ కుమార్తెతో రాజమౌళి వియ్యం అందుకోబోతున్నారు. ఈ ఏడాది చివర్లోనే కార్తికేయ వివాహం జరుగనున్నది. వివరాల్లోకి వెళితే..

 బాహుబలి చిత్రానికి సహాయ దర్శకుడిగా

బాహుబలి చిత్రానికి సహాయ దర్శకుడిగా

రాజమౌళి కుమారుడు కార్తికేయ బాహుబలి చిత్రానికి దర్శకత్వం విభాగంలో పనిచేశారు. ఆయన బాహుబలి సెకండ్ యూనిట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇక జగపతిబాబు సోదరుడు రాంప్రసాద్ కుమార్తే పూజా ప్రసాద్ గాయని. భక్తి గీతాలు ఆలపిస్తూ సంగీత అభిమానులను ఆకట్టుకొంటున్నారు.

 ప్రేమలో కార్తీకేయ, పూజా

ప్రేమలో కార్తీకేయ, పూజా

కార్తీకేయ, పూజా ప్రసాద్ గత కొద్దికాలంగా ప్రేమించుకొంటున్నారు. తమ ప్రేమ వ్యవహారాన్ని పెద్దలకు చెప్పి ఇటీవల ఒప్పించారని సమాచారం. దాంతో వీరిద్దరికి పెళ్లి జరిపించాలని నిర్ణయించారు.

ప్రైవేట్ వ్యవహారంగా నిశ్చితార్థం

ప్రైవేట్ వ్యవహారంగా నిశ్చితార్థం

కార్తికేయ, పూజా నిశ్చితార్తం బుధవారం సాయంత్రం వీబీ రాజేంద్ర ప్రసాద్ నివాసంలో జరిగింది. ప్రైవేట్ వ్యవహారంగా జరిగిన ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబాలకు చెందిన కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు. ఈ ఏడాది చివర్లో వివాహం జరిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వివాహ తేదిని త్వరలోనే నిర్ణయించనున్నట్టు తెలిసింది.

దర్శకుడిగా కార్తీకేయ

దర్శకుడిగా కార్తీకేయ

కార్తీకేయ తండ్రి రాజమౌళి బాటలోనే అడుగులు వేస్తున్నాడు. త్వరలోనే దర్శకుడిగా రంగ ప్రవేశం చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రముఖ బ్యానర్ రూపొందించే చిత్రానికి ఆయన దర్శకత్వం వహించనున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X