'మర్యాద రామన్న' చిత్రం మూలం గురించి రాజమౌళి
రాజమౌళి, సునీల్ కాంబినేషన్ లో వచ్చిన మర్యాదరామన్న చిత్రం అవర్ హాస్పటాలిటి అనే 1923 చిత్రం ఆధారంగా వచ్చిందని మీడియాలో వచ్చిన రివ్యూలలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. దీనిపై రాజమౌళి ట్విట్టర్ లో స్పందిస్తూ..అవర్ హాస్పటాలిటీ చిత్రానికి సంబంధించిన ప్రశ్నలన్నీ ఎక్కడనుంచైతే మీరు ఈ ఇన్ఫర్మేషన్ పొందారో ఆ సోర్స్ నే పట్టుకోండి అన్నారు. అలాగే దాదాపు చాలా మందికి (నైంటి పర్శంట్) తొంభై సంవత్సరాల క్రితం వచ్చిన ఈ సినిమా గురించి అందరికీ చెప్పింది నేను. ఏది ఏమైనా నా వ్యవహారం మీకు బాధ కలిగించుంటే క్షమించండి అన్నారు. ఇక ఈ చిత్రం ఇంత పెద్ద విజయం సాధించేలా సహకరించినందకు అందరికీ ధాంక్స్ అన్నారు. అలాగే తాము మర్యాద రామన్న విజయ యాత్ర చేయబోతున్నట్లు చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











