వాళ్లు చెత్తగా తీశారు, అందుకే డైరెక్టర్ అయ్యా.... ఆ హీరోల గురించి అడిగితే క్లాస్ పీకిన రాజమౌళి!
Recommended Video

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇటీవల పుత్తూరులో ఓ కాలేజీ స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా వారు చెప్పిన సమాధానాలకు రాజమౌళి ఆసక్తిక జవాబులు ఇచ్చారు. తను సినిమా రంగంలోకి రావడానికి, దర్వకుడు కావడానికి కారణం ఏమిటి? తనకు ఇన్స్‌స్పిరేషన్ ఎవరు? అనే విషయాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా కొందరు విద్యార్థలు తెలుగులు స్టార్ హీరోలైన ప్రభాస్, ఎన్టీఆర్, పవర్ స్టార్ పేర్లను ప్రస్తావిస్తూ... వారి గురించి ఒక్క మాట చెప్పాలని అడగటంతో రాజమౌళికి కోపం వచ్చింది. వారికి తనదైన శైలిలో క్లాస్ పీకారు.

అందుకే సినిమాల్లోకి వచ్చా
ఇంట్లో ఖాళీగా ఉంటే మా నాన్నగారు తిడతారు. బయటకు వెళ్లి ఏదో ఒక పని చేయాలని ఎడిటింగ్ అసిస్టెంట్ గా జాయినై పని చేస్తున్నట్లు నాటకం ఆడేవాడిని. కానీ ఆ ప్రాసెస్‌లో ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రస్ట్ పెరిగింది. తర్వాత మా నాన్నగారి దగ్గర రైటింగ్ అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యాను.

చెత్తగా తీశారు, అందుకే డైరెక్టర్ అయ్యా
నాన్నగారు కథ రాస్తుంటే రకరకాల యాక్షన్ ఎపిసోడ్స్ నేను చెప్పేవాడిని. అవి తీసుకెళ్లి ఆయన డైరెక్టర్లకు చెప్పేవారు... అవి వారికి చాలా నచ్చేవి. సినిమా రిలీజైనపుడు మనం చెప్పింది తెరపై ఎలా వచ్చింది అని చూస్తే సంతృప్తిగా అనిపించేది కాదు. వాళ్లు తీసే విధానం మరోలా ఉండేది. నాకు చాలా డిసప్పాయింటింగ్ అనిపించేది. మనం విజువలైజ్ చేసిన సీన్ మనం తీస్తేనే బావుంటుంది కదా అనేదాంట్లో నుంచి డైరెక్టర్ అవ్వాలనే కోరిక పెరిగింది అని రాజమౌళి తెలిపారు.

అదేమీ స్టాండర్డ్ రూల్ కాదన్న రాజమౌళి
చాలా మంది హీరోలకు మీతో సినిమా చేయక ముందు ఒక స్టార్డ డమ్, మీతో సినిమా చేసిన తర్వాత ఒక స్టార్ డమ్ వచ్చింది. దీనిపై మీరేమంటారు? అని ఓ విద్యార్థి ప్రశ్నించగా... అనటానికి ఏమీ లేదు. నాతో సినిమాలు చేసిన తర్వాత స్టార్ డమ్ పెరిగిన హీరోలు ఉన్నారు, వాళ్ల స్టార్ డమ్ పెరిగిన తర్వాత నేను చేసిన సినిమాలూ ఉన్నాయి. అదేమీ స్టాండర్డ్ రూల్ కాదు.

ఏంటి లాభం అనేదే ఆలోచిస్తాను
సినిమా మొదలు పెట్టే ముందు వాళ్లు స్టార్ డమ్ ఏమిటి? దాన్ని ఎలా పెంచాలనే ఆలోచన కంటే మన కథేంటి? దాని వల్ల అతడికి ఎంత ఉపయోగం? అతడి వల్ల మన సినిమాకు ఎంత ఉపయోగం అనే విషయాలే ఆలోచిస్తాం. స్టార్ డమ్ గురించి ఆలోచించము... అని రాజమౌళి తెలిపారు.

అది డబ్బు రూపంలో కనిపిస్తుంది
నేను సినిమా తీసేది ఎక్కువ మంది జనాలకు నచ్చాలి అనే అంశంతోనే. అది మనకు కలెక్షన్ల రూపంలో కనిపిస్తుంది. సినిమాకు కలెక్షన్లు అనేవి చాలా ముఖ్యం. ఎవరైనా డబ్బు కోసమే పని చేస్తారు. కానీ మనకు అందులో సంతృప్తి కలుగుతూ డబ్బులు రావాలి. మనకు డబ్బులు ముఖ్యం కాదు అని ఎన్నైనా కబుర్లు చెప్పొచ్చు... కానీ ఫైనల్‌గా మనీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది ఎంత వచ్చింది అనే దానిపైనే ఆడియన్స్ పల్స్ తెలుస్తుంది.

డబ్బు విచిత్రమైన పదార్థం
మనీ అనేది చాలా పవర్ ఫుల్ టూల్. దాని వెనకాలే మనం వెళితే అది మనకు అందకుండా చాలా దూరం వెళుతుంది. మన పని మనం చేసుకుంటూ వెళితే అది మన వెనక వస్తుంది. అది ఒక విచిత్రమైన పదార్థం.. అని రాజమౌళి అన్నారు.

స్టార్ హీరోల గురించి అడిగితే క్లాస్ పీకిన రాజమౌళి
ప్రభాస్, తారక్, పవర్ స్టార్ ఎవరి గురించైనా ఎంతసేపైనా మాట్లాడొచ్చు... నా డౌట్ ఏమిటంటే నేను వారి గురించి చెబితే మీకు ఏ విధంగా ప్లస్సవుతుంది? మీరు రాసుకునే సక్సెస్ మంత్రంలో నేను వాళ్ల గురించి అనుకునేది ఏ విధంగా ప్లస్సవుతుంది? అంంటూ రాజమౌళి క్లాస్ పీకాడు. సరే... ఒకే ప్రభాస గుడ్ ఫ్రెండ్, గుడ్ హ్యూమన్ బీయింగ్. ఆరు అడుగుల కంటే ఎక్కువ పొడవుంటాడు... ప్రభాస్ లో ఆ లక్షణాలు తీసుకోండి అంటూ రాజమౌళి వ్యాఖ్యానించారు.

అందుకే అంత టైమ్ ఇవ్వొద్దు
మీ జర్నీ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు భయం వేయలేదా?... ప్రతి క్షణం భయం వేస్తూనే ఉంటుంది. సినిమా మొదలైనప్పటి నుంచి విడుదలయ్యే వరకు ఉంటుంది. కానీ బ్రెయిన్ కు అంత ఆలోచించే టైమ్ ఇవ్వకూడదు. మన పని మనం చేసుకుంటూ వెళ్లిపోవాలి. సమయం ఇస్తే భయాలు, ఆశలు వస్తాయని రాజమౌళి తెలిపారు.

ఆయనంటే గౌరవం
నా జీవితంలో ఒక్కో అంశంలో ఒక్కొక్కరు ఆదర్శంగా ఉన్నారు. నా చిన్నప్పటి నుంచి చుట్టుపక్కలవారు చెప్పిన విషయాలు బట్టి బాగా ఇన్స్‌స్పైర్ చేసిన వ్యక్తి రామోజీరావుగారు. ఆయనంటే చాలా గౌరవం. సైకిల్ మీద పచ్చళ్లు అమ్మే స్థాయి నుంచి ఒక మహా బిజినెస్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తిగా ఎదిగారు. వ్యక్తిగతంగా జయప్రకాష్ నారాయణను హీరోగా భావిస్తాను.

సినిమా రంగంలో...
సినిమా నిర్మాతల్లో శ్యాం ప్రసాద్ రెడ్డిగారు ఇష్టం. ఆయన సినిమా అంటే ప్రాణం పెడతారు. ఆస్తులు సైతం అమ్మేసి సినిమాలో పెడతారు. దర్శకుల్లో మెల్ గిబ్సన్.. ఆయన బ్రేవ్ హార్ట్ మూవీ అంటే పిచ్చి. ఆయన డ్రమటైజ్ చేసే విధానం బావుంటుంది. తెలుగులో కెవి రెడ్డి గారు అంటే చాలా ఇష్టమని రాజమౌళి తెలిపారు.


Click it and Unblock the Notifications











