రాజమౌళిని టెన్షన్ లో పడేసిన అబిమాని
"నీ మాటలు నన్ను టెన్షన్ లో పడేస్తున్నాయి. వారం రోజులు నిద్ర పట్టదయ్యా" అంటూ రాజమౌళి తాజాగా ట్వీట్ చేసారు. రాజమౌళి అభిమాని ఒకరు ఈగ సినిమా ఆలస్యం గురించి ప్రస్తావిస్తూ..అన్నయ్యా..నువ్వు సినిమా కి సినిమాకి మధ్య ఇంత గ్యాప్ తీసుకోవటం నాకు బాధగా ఉంది,అయినా పర్వాలేదు,నువ్వు అవతార్ లాంటి సినిమాని ఇస్తావని అనుకుంటున్నాను అని ట్వీట్ చేసారు. దానికి రాజమౌళి అవతార్ లాంటి సినిమా అనేసరికి ఇలా ఫన్నీ గా రిప్లై ఇచ్చారు. ఇక మొదటనుంచి రాజమౌళిది బాగా కష్టపడి,తను అనుకున్న అవుట్ పుట్ వచ్చేవరకూ నిద్రపోనివ్వని తత్వమే అని ఆయనతో పనిచేసిన వారు చెప్తారు. అందుకే జానియర్ ఎన్టీఆర్ రాజమౌళి సినిమాని శిల్పం చెక్కినట్లు చెక్కుతాడని జక్కన్న అని పిలుస్తాడు. అందుకే ఆ రేంజి సక్సెస్ వస్తుందని ఆయన అభిమానులు అంటూంటారు.
ఇక ఈగ చిత్రం ప్రారంభించి చాలా రోజులు అయ్యింది. కానీ గ్రాఫిక్ వర్క్ ఉండటంతో బాగా లేటవుతోందని తెలుస్తోంది.సమంత,నాని జంటగా నటిస్తున్న ఈ చిత్రం గ్రాఫిక్స్ ప్రధానంగా సాగుతుంది. 'ఈగ" సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే 'తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే 'ఈగ" రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో 'ఈగ"గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ 'ఈగ"ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ" అన్నదే క్లుప్తంగా 'ఈగ" కథాంశం.


Click it and Unblock the Notifications











