SS Rajamouli: కరోనా బారిన పడిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి... పాజిటివ్ అని తేలడంతో..
సంచలన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కరోనా బారిన పడ్డారు. తాజాగా చేయించుకొన్న రోగ నిర్దారణ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. స్వయంగా ఆయనే తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని అభిమానులకు తెలిపారు. దాంతో సినీ ప్రముఖులు, అభిమానులు షాక్ గురయ్యారు. త్వరగా కోలుకోవాలని జక్కనకు ప్రార్థిస్తున్నారు. జక్కన ట్వీట్ చేసిన వివారాల్లోకి వెళితే..

నాకు, నా ఫ్యామిలీ మెంబర్స్‌కు
తనకు కరోనావైరస్ సోకిన విషయాన్ని రాజమౌళి ట్విట్టర్‌లో వెల్లడిస్తూ.. నా ఫ్యామిలీ మెంబర్స్, నేను కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాం. కాని జ్వరం తగ్గుముఖం పట్టినట్టు తెలిసింది. కానీ తాజాగా వెల్లడైన రోగ నిర్ధారణ పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది అని రాజమౌళి ట్వీట్ చేశారు.

స్వీయ గృహనిర్బంధంలోకి
ప్రస్తుతం కరోనావైరస్ పాజిటివ్ అని తేలడంతో నాతోపాటు కుటుంబ సభ్యులందరూ స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లాం. డాక్టర్లు సూచనలు, సలహాలు పాటిస్తూ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకొంటున్నాం అని రాజమౌళి వెల్లడించారు.

అన్ని రకాల జాగ్రత్తలు, సలహాలతో
ప్రస్తుతం నా కుటుంబ సభ్యులందరం బాగానే ఉన్నాం. కరోనా లక్షణాలు కనిపించకపోయినా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొంటున్నాం. సహాలు తీసుకొంటున్నాం. రోగ నిరోధక శక్తిని పెంచుకొనే ప్రయత్నాల్లో ఉన్నాం. మేము కరోనా నుంచి బయటపడిన తర్వాత ప్లాస్మా డొనేట్ చేయడానికి సిద్దమవుతున్నాం అని రాజమౌళి మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.
Recommended Video

RRRపై కరోనా ఎఫెక్ట్
బాహుబలి సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, విజయాన్ని సొంతం చేసుకొన్న రాజమౌళి ప్రస్తుతం RRR సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఎన్టీఆర్, రాంచరణ్‌తో భారీ మల్టీస్టారర్‌ను రూపొందిస్తున్నారు. కాగా కరోనావైరస్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత ట్రయల్ షూట్ ప్రయత్నం చేసినా.. కోవిడ్ భయాలతో దానిని కూడా నిలిపివేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజమౌళి కరోనా బారిన పడటం అభిమానులను, సినీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నది.


Click it and Unblock the Notifications











