»   » పాకిస్థాన్లో పండగ, థాంక్స్ చెప్పిన రాజమౌళి... త్వరలో ప్రయాణం, ఎందుకో తెలుసా?

పాకిస్థాన్లో పండగ, థాంక్స్ చెప్పిన రాజమౌళి... త్వరలో ప్రయాణం, ఎందుకో తెలుసా?

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Rajamouli Thanked Pakistan Film Festival Organisers

  టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి త్వరలో పాకిస్థాన్ వెళ్లబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పాకిస్థాన్‌కు థాంక్స్ చెబుతూ చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయింది. పాక్ వెళ్లి అక్కడ జరిగే సినిమా పండగ(ఫిల్మ్ ఫెస్టివల్)లో ఈ దర్శక ధీరుడు పాల్గొనబోతున్నారు.

  రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితం అయింది. ఈ క్రమంలో ఆయన ఆయా దేశాలు పర్యటించారు. తాజాగా పాకిస్థాన్‌ దేశంలోని కరాచీలో జరిగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాహుబలి ప్రదర్శించబోతున్నారు.

  SS Rajamouli Thanks to Pakistan international film festival

  దీనిపై రాజమౌళి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ 'బాహుబలి' చిత్రం వల్ల వివిధ ప్రదేశాల్లో పర్యటించే అవకాశం దక్కింది. అయితే వాటన్నింటికంటే ఇపుడు పాకిస్థాన్లో ట్రావెల్ చేయడం మరింత ఎగ్జైటింగ్‌గా ఉంది. నన్ను ఆహ్వానించిన 'పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్, కరాచీ' వారికి ధన్యవాదాలు అని రాజమౌళి ట్వీట్ చేశారు.

  పాకిస్థాన్లో హిందీ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. ఎన్నో బాలీవుడ్ చిత్రాలు అక్కడ కూడా విడుదలై మంచి విజయం సాధించాయి. పాకిస్థాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాహుబలి చిత్రం ప్రదర్శిస్తున్న నేపథ్యంలో.... దీన్ని కూడా పాక్‌లో విడుదల చేసే అవకాశం ఉందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

  English summary
  "Baahubali has given me opportunities to travel to a number of countries... The most exciting of them all is now, Pakistan. Thank you Pakistan international film festival, Karachi for the invite." SS Rajamouli tweeted.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more