'ఊసరవెల్లి' పై రాజమౌళి కామెంట్

By Srikanya

ఊసరవెల్లి గురించి రాజమౌళి తాజాగా తన ట్విట్టర్ లో...కంగ్రాట్స్ టీమ్ ఊసరవెల్లి ఫర్ గెట్టింగ్ ది హైయిస్ట్ ఓపినింగ్ ఎవర్..కంగ్రాట్యులేషన్స్ తారక్..విపరీతమైన శక్తులున్న ఉన్న హీరో కాని సబ్డెక్టుని ఎన్నుకున్నందుకు.. ఇది చాలా రిప్రెష్ గా ఉంది..ఇలాంటి రొమాంటిక్ ,కామిడీ పాత్రల్లో అతన్ని చూడటం ...అంటూ ట్వీట్ చేసారు.ఆయన ఇలాంటి ఎక్సపెరెంట్ సినిమాని ఎన్నుకుని చేసినందుకు ఎన్టీఆర్ ని పర్శనల్ గా కూడా చాలా ఎప్రిషియేట్ చేసినట్లు ఎన్టీఆర్ మీడియాతో చెప్పారు. మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ కి, రాజమౌళి కి మంచి అనుభంధం కొనసాగుతోంది. ఎన్టీఆర్ ..రాజమౌళిని జక్కన్నా అని ప్రేమగా పిలుస్తారు. రాజమౌళి మొన్న ఆ మధ్య జరగిన ఊసరవెల్లి ఆడియో పంక్షన్ కి హాజరై చాలా ఎమోషనల్ గా మాట్లాడారు.

అప్పుడు తనతో సినిమా ఎప్పుడని డైరక్ట్ గానే ఎన్టీఆర్ స్టేజిపై రాజమౌళిని అడగటం జరిగింది. ఇక రాజమౌళి ఈ ఊసరవెల్లి చిత్రం చూడటానికి ఈగ షూటింగ్ ని ఆపుచేసుకుని మరీ ఆ రోజు వెళ్లారు. అందుకోసం తన ఫ్యామిలీలో ఉన్న యాభై మందితో కలిసి వెళ్లటం జరింగిందని ట్విట్టర్ లో రాసుకున్నారు. ఇక రాజమౌళి ప్రస్తుతం ఈగ చిత్రం చేస్తున్నారు. ఆ తర్వాత ప్రభాస్ తో చిత్రం ఎనౌన్స్ చేసారు. ఈ రెండింటి తర్వాత ఎన్టీఆర్ తో చేసే చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ తో గతంలో సింహాద్రి, స్టూడెంట్ నెంబర్ వన్,యమదొంగ వంటి సూపర్ హిట్స్ ని రాజమౌళి ఇచ్చిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X