కాలేజ్ డేస్ కి తీసుకెళ్ళింది: రాజమౌళి
“'ఏ మాయ చేసావె" చూసాను. కుర్రాళ్ళు ఎందుకు ఆ సినిమా వెనక పిచ్చి పట్టి తిరిగారో అర్ధం అయ్యింది. ఈ సినిమాను ఆలస్యంగా చూసినప్పటికీ, నన్ను కూడా నా కాలేజ్ రోజులకు తీసుకువెళ్ళింది." అని ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని ప్రముఖ దర్శకులు రాజమౌళి వ్యక్తంచేశారు. ఇక ప్రస్తుతం రాజమౌళి ఈగ చిత్రం చేస్తూ బిజీగా ఉన్నారు. 'ఏ మాయ చేసావె" హీరోయిన్ సమంత ఈ చిత్రంలో చేస్తోంది. నాని హీరోగా చేసే ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ప్రధాన పాత్ర వహిస్తాయి.


Click it and Unblock the Notifications











