ఈగకీ ఆ సినిమాకీ సంభధం లేదు..రాజమౌళి
రాజమౌళి తన తాజా చిత్రం ఈగ గురించి లేటెస్ట్ గా ఏమని ట్వీట్ చేసారంటే...నేను ప్లై, ఫ్లై 2 చిత్రాల సినాప్సిస్ లు చదివాను..అవన్నీ సైన్స్ ఫిక్షన్ లు హర్రర్ ఫిల్మ్ లు..కానీ నా ఈగ మాత్రం ఫాంటసీతో కూడిన కామిడీ సినిమా.ఖచ్చితంగా వాటితో వీటికి ఏ సంభందం లేదు అన్నారు. ఇక ప్లై పేరుతో హాలీవుడ్ లో గతంలో హర్రర్ చిత్రాలు వచ్చి హిట్టై సీక్వెల్స్ కూడా వచ్చాయి. చాలా మంది రాజమౌళి ఈగ చిత్రం చేస్తున్నాడనగానే వాటినుంచి ప్రేరణ పొందారమో అన్నట్లు సందేహాలు వెళ్ళబుచ్చటంతో ఇలా క్లారిఫై చేసాడు. సమంత, నాని, కన్నడ స్టార్ సుదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కీలక పాత్రను పోషించనుంది. సురేష్ ప్రోడక్షన్ సమర్పణలో ఈచిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకి యం యం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంధిల్ కెమెరా అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











