twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మా భార్య కూడా అలాంటిదే కట్టుకుందామంటోంది: ఎస్.ఎస్ రాజమౌళి

    By Srikanya
    |

    ప్రముఖ దర్శకుడు రాజమౌళి రీసెంట్ గా ఇలా ట్వీట్ చేసారు...ఆర్ట్ డైరక్టర్ రవి ఈగ చిత్రం లో విలన్ హౌస్ ని ఫెంటాస్టిక్ గా రూపొందించాడు.అది చూడ్డానికి చాలా బావుంది.మా భార్య అలాంటి డిజైన్ నే ఇల్లు కట్టుకునేటప్పుడు ఉపయోగిద్దామంటోంది అన్నారు. ఇక రాజమౌళి ప్రస్తుతం ఈగ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సమంత, నాని, కన్నడ స్టార్ సుదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కీలక పాత్రను పోషించనుంది.సురేష్ ప్రోడక్షన్ సమర్పణలో ఈచిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకి యం యం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

    'ఈగ" సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే 'తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే 'ఈగ" రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో 'ఈగ"గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ 'ఈగ"ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ" అన్నదే క్లుప్తంగా 'ఈగ" కథాంశం.

    English summary
    Art director ravi completed a Fantastic set for villain's house 4 eega.It luks so good,that my wife wants d same design wen we build ours..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X