India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Happy Birthday వెతికి పట్టుకొని బంగారం తవ్వుకొంటారు.. మైత్రీపై రాజమౌళి హాట్ కామెంట్స్

  |

  స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠీ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా "హ్యాపీ బర్త్ డే". ఈ సినిమాలోని సరికొత్త పాత్రలే కాదు విభిన్నంగా చేస్తున్న ప్రమోషన్ కూడా సినిమా మీద ఆసక్తి కలిగిస్తోంది. ఈ చిత్రాన్ని మత్తువదలరా ఫేమ్, దర్శకుడు రితేష్ రానా రూపొందిస్తున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా హ్యాపీ బర్త్ డే సినిమా జూలై 8న విడుదల కాబోతున్నది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం దర్శకుడు రాజమౌళి చేతుల మీదుగా హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా

  దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ...మైత్రీ మూవీ మేకర్స్ అంటే మంచి ప్రాజెక్ట్స్ వెతికి పట్టుకుంటూ బంగారం తవ్వుకునే సంస్థ. హ్యాపీ బర్త్ డే కూడా ఆ సంస్థకు మరో పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా. ట్రైలర్ బ్లాక్ బస్టర్‌గా ఉంది. చెర్రీకి సినిమా ప్రొడక్షన్ మీద చాలా అవగాహన ఉంది. ఆయన ఏ సంస్థకైనా అస్సెట్ లాంటి వారు. ఈ సినిమా చెర్రికి మంచి సక్సెస్ ఇవ్వాలి. దర్శకుడు రితేష్ కు తన సినిమాల మీద నమ్మకం ఎక్కువ. ట్రైలర్ లో పాన్ తెలుగు సినిమా అని చూడగానే అతనిలో నవ్వొచ్చింది. లావణ్య క్యారెక్టర్ బాగుంది.

  హీరోయన్స్‌కు కథను ముందుండి నడిపే ఇలాంటి పాత్రలు దొరకడం అరుదు. ఆమె బాగా నటించిందని అర్థమవుతుంది. ఇప్పుడున్న కమెడియన్స్‌లో నాకు వెన్నెల కిషోర్, సత్య అంటే ఇష్టం. వాళ్లు టీజర్, ట్రైలర్ లో ఆకట్టుకునేలా ఉన్నారు. కామెడీ, థ్రిల్లర్ కలిపి చేయడం కష్టం. ఒకటి ఎక్కువైతే ఇంకొటి తగ్గిపోతుంది. రితేష్ వాటిని బాగా కంబైన్ చేసి ఉంటాడని తెలుస్తోంది. ఈ మధ్య ప్రేక్షకులు థియేటర్స్ కు రావడం లేదు అంటున్నారు కానీ నా అభిప్రాయం ప్రకారం మనసు పెట్టి కష్టపడి చేసిన ఏ సినిమానూ ప్రేక్షకులు వదులుకోరు. అలా కష్టపడాలని సూచిస్తున్నా. హ్యాపీ బర్త్ డేలో ఆ ప్రయత్నం జరిగిందని ఆశిస్తున్నా. అన్నారు.

  SS Rajamouli unveils Happy Birthday trailer in AMB of Hyderabad

  దర్శకుడు రితేష్ రానా మాట్లాడుతూ...నా మొదటి చిత్రం టీమ్ తోనే మళ్లీ పనిచేశాను. దాని కంటే ఈ సినిమాలో డబుల్ ఫన్, డబుల్ యాక్షన్, డబుల్ థ్రిల్ ఉంటుంది. థియేటర్ లో హ్యాపీ బర్త్ డే సినిమా చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.

  హీరోయిన్ లావణ్య త్రిపాఠీ మాట్లాడుతూ...డైరెక్టర్ రాజమౌళి మా కార్యక్రమానికి రావడం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోంది. మాదొక డిఫరెంట్ ఫిల్మ్ అని మేము చెప్పక్కర్లేదు. మీరు టీజర్, ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. నిర్మాత కొత్తగా ఆలోచిస్తేనే ఇలాంటి మూవీ తెరపైకి వస్తుంది. దర్శకుడిగా రితేష్ రానా ఇప్పటికే నిరూపించుకున్నాడు. నేను ఈ తరహా సినిమాలో నటిస్తానని అనుకోలేదు. నా క్యారెక్టర్ కంప్లీట్ గా కొత్తగా ఉంటుంది. జూలై 8న థియేటర్ లో పార్టీ చేసుకుందాం. అన్నారు.

  నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ..మత్తు వదలరా తర్వాత క్లాప్ ఎంటర్ టైన్ మెంట్ తో కలిసి రెండో సినిమా చేస్తున్నాం. మత్తు వదలరా టీమ్ మళ్లీ ఈ చిత్రానికీ పనిచేశారు. అదే మ్యాజిక్ హ్యాపీ బర్త్ డే సినిమాలోనూ చేసి ఉంటారని నమ్ముతున్నాం. జాతి రత్నాలు మూవీని ఎలా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేశారో మా చిత్రాన్నీ అలాగే ఆస్వాదిస్తారు. లావణ్య త్రిపాఠీ ఈ చిత్రానికి ఆకర్షణగా నిలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ లో మా భాగస్వామి చెర్రి. ఎంత పెద్ద బాధ్యతనైనా సులువుగా నిర్వరిస్తుంటారు. యమదొంగ, ఒక్కడున్నాడు లాంటి భారీ చిత్రాలు నిర్మించిన క్లాప్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థకు మైత్రీ కన్నా గొప్ప చరిత్ర ఉంది. మా అసోసియేషన్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా. అన్నారు.

  SS Rajamouli unveils Happy Birthday trailer in AMB of Hyderabad

  నిర్మాత చెర్రి మాట్లాడుతూ...ఎంతో బిజీగా ఉండి కూడా మా కార్యక్రమానికి వచ్చిన దర్శకుడు రాజమౌళికి కృతజ్ఞతలు. హ్యాపీ బర్త్ డే సినిమా నుంచి ఇప్పటిదాకా విడుదల చేసిన టీజర్, ట్రైలర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే ఇదొక కొత్త తరహా సినిమా అని మీకు అర్థమై ఉంటుంది. దర్శకుడు రితేష్ రానా తన మొదటి సినిమా మత్తు వదలరాతో హిలేరియస్ థ్రిల్లర్ సినిమా తెరకెక్కించి ఆకట్టుకున్నాడు. ఇదొక సర్రియల్ యాక్షన్ కామెడీ ఫిల్మ్. ఫిక్షనల్ నేపథ్యంతో కథ సాగుతుంది. ఒక్కో ఛాప్టర్ ద్వారా ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ వెళ్లారు దర్శకుడు. చివరలో ఆ పాత్రలన్నీ ఎలా కలుస్తాయి అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఒక మంచి థ్రిల్లింగ్ కామెడీని ఇందులో చూస్తారు. రితేష్ తో పాటు మిగతా టెక్నిషియన్స్ ఒక టీమ్ లా పనిచేశారు. జూలై 8న మా సినిమాను థియేటర్ లో చూడండి, మీ రెస్పాన్స్ కోసం వేచి చూస్తుంటాం. అన్నారు.

  పక్కా కమర్షియల్ పక్కా genuine రివ్యూ *Entertainment | Telugu OneIndia

  ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ సురేష్ సారంగం, కాస్ట్యూమర్ రవితేజ తదితరులు పాల్గొన్నారు.

  English summary
  Director Ritesh Rana’s upcoming movie Happy Birthday starring the gorgeous Lavanya Tripathi in the lead role is gearing up for its worldwide release in Pan Telugu on July 8th. The film's teaser got overwhelming response. Today, ace director SS Rajamouli who is pride of India has released theatrical trailer of the movie and wished the team all the luck.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X