బాహుబలి కట్టప్ప సీక్రెట్ వారికి మాత్రమే తెలుసు: రాజమౌళి
News
oi-Santhosh Kumar Bojja
By Bojja Kumar
|
బాహుబలి కట్టప్ప సీక్రెట్ వారికి మాత్రమే తెలుసు !
రాజమౌళి దర్శకత్వంలో 2015లో వచ్చిన 'బాహుబలి-ది బిగినింగ్' భారీ విజయం సాధించింది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ 'బాహుబలి' పార్ట్ 2 కోసం ఎదురు చూసేలా చేసిన ప్రశ్న 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?... ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికే చాలా మంది బాహుబలి-2 సినిమా చూశారు. ఫలితంగా ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయి కలెక్షన్ సాధించింది.
రాజమౌళి ‘టేక్ 2 విత్ అనుపమ అండ్ రాజీవ్'
‘టేక్ 2 విత్ అనుపమ అండ్ రాజీవ్' అనే కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి మాట్లాడుతూ.... "బాహుబలి-2 విడుదల ముందు ‘బాహుబలిని కట్టప్పను ఎందుకు చంపాడు?' అనే ప్రశ్నకు సమాధానం చిత్ర యూనిట్లో కొంత మందికి మాత్రమే తెలుసు, అయితే బాహుబలి-1 చిత్రాన్ని మనసు పెట్టి రెండు సార్లు చూస్తే ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోవడం కష్టసాధ్యం ఏమీ కాదన్నారు."
ఆ ప్రశ్నకు సమాధానం అంత ఈజీ కాదు
‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?' అని కాకుండా..... ‘బాహుబలిని కట్టప్ప ఎలా చంపుతాడు?' అని చాలా మంది నన్ను అడిగారు. అలాంటి పని అతడు ఎలా చేయగలిగాడు? అని అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానం ఊహించడం అంత ఈజీ కాదు అని రాజమౌళి తెలిపారు.
ఆ సీక్రెట్ వారికి మాత్రమే తెలుసు
బాహుబలి సినిమాకు పని చేసిన మెయిన్ టెక్నీషియన్స్ ఓ పది పదిహేను మందికి మాత్రమే సినిమా పూర్తి స్టోరీ తెలుసు. అయితే సినిమాకు పని చేసిన మిగతా వారికి తెలియదు.... అని రాజమౌళి తెలిపారు.
ఏం జరుగుతుందో అర్థం అయ్యేది కాదు
షూటింగ్ రెండు సంవత్సరాలకుపైగా సాగడం, ఒక సీన్ ఇక్కడ, ఒక సీన్ వేరే ప్రాంతంలో జరుగటం వల్ల ఏ సీన్ చిత్రీకరిస్తున్నామో యూనిట్ సభ్యులకు అర్థం అయ్యేది కాదు, కన్‌ఫ్యూజ్ అయ్యేవారు. ఆ విధంగా కట్టప్ప సీక్రెట్ బాహుబలి 2 విడుదలయ్యే వరకు బయటకు రాకుండా చేయగలిగాం. ఆ సినిమాలో సమాధానం వివరంగా చెప్పామని రాజమౌళి తెలిపారు.
Filmmaker S.S. Rajamouli said very few people knew the mystery of why Katappa killed Baahubali in the blockbuster 'Baahubali: The Beginning' in 2015. He also said that it wasn't very difficult to solve the mystery had viewers seen the film twice with their mind completely engaged.
Story first published: Monday, December 11, 2017, 14:24 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more