పదవ తేదీ వైజాగ్ వెళ్ళి అక్కడే అంటూ ట్వీట్ చేసిన రాజమౌళి
ప్రముఖ దర్శకుడు రాజమౌళి రీసెంట్ గా ఇలా ట్వీట్ చేసారు. నేను పదవ తేదీన వైజాగ్ వెళ్ళి అక్కడ బద్రీనాధ్ చిత్రం చూస్తాను.అక్కడ వి వి వినాయిక్ గారి ధియోటర్ వి మాక్స్ లో అన్నారు.ఇదే విషయమై కొద్ది రోజులు క్రితం సంగీత దర్శకుడు కీరవాణిగారు కూడా తానూ రిలీజ్ రోజున వైజాగ్ వెళ్తానని ట్వీట్ చేసారు.వినాయిక్ వైజాగ్ లో రాజ్ కమల్ ధియోటర్ ని కొనుక్కున్నారు.దాన్ని మల్టిప్లెక్స్ గా మారుస్తాడని తెలుస్తోంది.
అలాగే తేజ, రామానాయుడు కూడా అక్కడ రామా,జ్యోతి ధియోటర్స్ ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న 'బద్రినాథ్'వచ్చే నెల 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ చిత్రంలో అల్లు అర్జువ్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. కూర్పు: గౌతంరాజు, కళ: ఆనంద్‌సాయి, ఛాయాగ్రహణం: రవివర్మన్.


Click it and Unblock the Notifications











