మహేష్ ఫ్యాన్స్ అభిప్రాయం అడుగుతున్న రాజమౌళి
ఈ నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నకు రాజమౌళి తనదైన రీతిలో స్పందిస్తున్నారు. రజనీకాంత్‌కు తమిళంలో ఎంత మార్కెట్ ఉందో తెలుగులో మహేష్ బాబుకు అంతే ఉందని చెప్పుకొచ్చారు. మహేష్ బాబుతో సినిమా చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను అని రాజమౌళి తన మనసులోని మాటను బయట పెట్టారు.
మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్లతో సినిమాలు చేసినప్పుడు, అభిమానుల అభిరుచి మేరకు సినిమా తీస్తే సక్సెస్ అవుతాం అని భావిస్తున్న రాజమౌళి....'గూఢచారి 116, అల్లూరి సీతారామరాజు, జేమ్స్ బాండ్ వీటిలో ఎలాంటి కథ చేస్తే బాగుంటుందో మహేస్ బాబు అభిమానులు చేబితే బాగుంటుంది. దాన్ని బట్టి మహేష్ కోసం ఓ కథ రాసుకుంటాను అంటున్నారు.
మరి రాజమౌళి మొహమాటానికి పోయి ఇలా అంటున్నారా? మరి నిజంగనే మహేష్ బాబుతో సినిమా చేసే ఆలోచన ఏమైనా ఉందా? అనేది కాలమే నిర్ణయించాలి. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే తెలుగు సినిమా రికార్డున్నీ బద్దవ్వడం మాత్రం ఖాయం అని చెప్పక తప్పదు.


Click it and Unblock the Notifications












