ఆ క్రూరుడితో రాజమౌళి మరోసారి!
హైదరాబాద్ : రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఈగ' చిత్రంలో క్రూరమైన స్వభావం గల భయంకరమైన విలన్ పాత్ర పోషించిన కన్న స్టార్ కిచ్చా సుదీప్...మరోసారి రాజమౌళితో పని చేయబోతున్నారు. రాజమౌళితో ఆయనతో మరోసారి పని చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
సెప్టెంబర్ 2న సుదీప్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆ హీరోకి శుభాకాంక్షలు తెలుపుతూ రాజమౌళి ఈ విషయం వెల్లడించారు. 'నేను సుదీప్‌కి పెద్ద అభిమానిని. నేను ఇప్పటికీ నమ్మలేక పోతేన్నాను ఆయన 39 సంవత్సరాలు క్రాస్ అయ్యాడంటే, నా వరకైతే ఆయన ఇప్పటికీ చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు. అతనితో మరోసారి పని చేయాలని ఉంది' అంటూ రాజమౌళి తెలిపారు.
సుదీప్ మాట్లాడుతూ...రాజమౌళి లాంటి పనిచేసే అవకాశం దక్కడం ఎంతో గొప్పగా భావిస్తాను. ఆయనతో మరోసారి పని చేసే అవకాశం దక్కడం అంటే ఎంతో హ్యాపీగా ఫీలవుతాను అని తన మనసులోని భావాన్ని వ్యక్తం చేసారు. రాజమౌళి వల్ల తన స్టార్ ఇమేజ్ ఎంతో పెరిగిందని, ఈగ చిత్రం తన సినీ జీవితంలో ఒక మంచి టర్నింగ్ పాయింట్ అయిందని చెప్పుకొచ్చారు.
సుదీప్ సినిమాల విషయానికొస్తే...సుదీప్, జగపతిబాబు కాంబినేషన్ లో బచ్చన్ అనే చిత్రం తెరకెక్కుతోంది. కన్నడలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగులోకి డబ్ అవనుందని సమాచారం. ఇందులో సుదీప్ హీరో కాగా జగపతిబాబు పోలీస్ అధికారిగా కీ రోల్ లో కనిపించనున్నారు. పన్నెండు రోజుల పాటు జగపతిబాబు ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొననున్నారు.


Click it and Unblock the Notifications











