twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేవి శ్రీ ప్రసాద్‌తో పోటీపై క్లారిటీ ఇచ్చిన థమన్.. అతను సిక్స్ కొట్టినప్పుడు నేను కొట్టకపోతే ఎలా?

    |

    సినిమా ఇండస్ట్రీలో టెక్నీషియన్ల మధ్యన ఫ్రెండ్షిప్ ఎంత ఉన్నా కూడా తెరవెనుక మాత్రం పోటీ తీవ్రత భారీ స్థాయిలో ఉంటుంది. ఇన్ డైరెక్ట్ సెటైర్స్ వేసుకోవడం కూడా కామన్. ఇక ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య కూడా పోటీ తీవ్రత ఎక్కువైనట్లు తెలుస్తోంది. నెంబర్ వన్ ప్లేస్ అనేది ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. ఇక దేవిశ్రీప్రసాద్ థమన్ మధ్య కూడా పోటీ ఎక్కువైనట్లు టాక్ వస్తున్న తరుణంలో ఆ విషయంపై థమన్ సున్నితంగా స్పందించాడు.

    యువ నటి అస్మిత సూద్ క్లీవేజ్ షో... పొట్టి దుస్తుల్లో హంగామా

    బిగ్ బడ్జెట్ ప్రాజెక్టులనే పట్టేస్తున్నాడు

    బిగ్ బడ్జెట్ ప్రాజెక్టులనే పట్టేస్తున్నాడు

    సంగీత దర్శకుడు థమన్ ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. ముఖ్యంగా అల.. వైకుంఠపురములో సినిమా నుంచి అతని స్పీడ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. గతంలో పెద్ద సినిమా అవకాశాలను కాస్త ఆలస్యంగా అందుకుంటూ వచ్చిన థమన్ మొత్తానికి ఇప్పుడు మొత్తం బిగ్ బడ్జెట్ ప్రాజెక్టులనే పట్టేస్తున్నాడు.

    చేతిలో పెద్ద సినిమాలు

    చేతిలో పెద్ద సినిమాలు

    వకీల్ సాబ్ హిట్టుతో అతని స్టైల్ కూడా మారిపోయింది. థమన్ సినిమాకు తగ్గట్లు ఇలాంటి మ్యూజిక్ కూడా ఇవ్వగలడా అనేలా వర్క్ చేశాడు. ఇండస్ట్రీలో పెద్ద దర్శకులు చాలా వరకు ఫస్ట్ ఆప్షన్ గా థమన్ ను సెలెక్ట్ చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు , త్రివిక్రమ్ సినిమాలకు మ్యూజిక్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. రామ్ చరణ్ శంకర్ సినిమాకు కూడా సెలెక్ట్ అయ్యాడు.

    దేవిశ్రీప్రసాద్ తో పోటీ

    దేవిశ్రీప్రసాద్ తో పోటీ

    అయితే దేవిశ్రీప్రసాద్ తో పోటీ ఉందా అని ఇటీవల ఇంటర్వ్యూలో ఎదురైన ఒక ప్రశ్నకు థమన్ సున్నితంగా స్పందించారు. థమన్ మాట్లాడుతూ.. తప్పకుండా పోటీ అనేది ఉండాలి. లేకుంటే బెస్ట్ మ్యూజిక్ ఇవ్వలేము. ఉప్పెన సినిమాతో బెస్ట్ మ్యూజిక్ ఇచ్చినప్పుడు మాకు కూడా ఇవ్వాలని ఉంటుంది.. అని చెప్పాడు.

    జాతిరత్నాలు చిట్టి సాంగ్ కూడా..

    జాతిరత్నాలు చిట్టి సాంగ్ కూడా..

    కేవలం ఉప్పెన అనే కాదు జాతిరత్నాలు చిట్టి సాంగ్ కూడా హిట్టయ్యింది. అలా అన్ని హిట్టయితేనే బెస్ట్ సాంగ్స్ వస్తాయి. ఎక్కడైనా సరే కాంపిటీషన్ లేకపోతే వర్కౌట్ కాదు. కాంపిటీషన్ అనేది ఉండాలి. క్రికెట్ లో ఒక ప్లేయర్ సిక్స్ కొడితే మనకు కూడా బాగా ఆడాలి. అవతలి టీమ్ వాడు ఒక సిక్స్ కొడితే నేను కూడా సిక్సులు కొట్టాలని అనుకుంటాను.. అని చెప్పాడు.

    Recommended Video

    Vakeel Saab Day 1 Collections Report | ఈ వారం చాలా కీలకం !
    ఉప్పెనతో హిట్టు కొట్టాడు

    ఉప్పెనతో హిట్టు కొట్టాడు

    దేవిశ్రీప్రసాద్ కెవ్వుకేక అనే మాస్ సాంగ్ ఇచ్చినప్పుడు నేను అలా వెళ్లకుండా సారొస్తారా.. అనే సాంగ్ తో వెళ్ళాను. ఇక నేను క్రాక్ తో వస్తే.. మళ్ళీ అతను ఉప్పెనతో హిట్టు కొట్టాడు. ఇక ఇప్పుడు నేను వకీల్ సాబ్ తో వచ్చాను... ఇలా ఒక రకమైన మంచి కాంపిటీషన్ మా మధ్యలోనే కాదు.. అందరిలోను ఉంటుంది.. అని థమన్ వివరణ ఇచ్చాడు.

    English summary
    Music Director Devi Sri Prasad has been a music director for the past 20 years in the South Cinema Industry. Devi, who has set a new trend with her songs at an early age. He worked with almost all of the star heroes in Tollywood. Devi Style differentiates the music from the short film without making a big difference. Otherwise some rumors of this rock star wedding are now going viral.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X