తమన్‌కు క్లిష్టమైన సర్జరీ?.. తప్పనిసరి పరిస్థితుల్లో.. బాలూ సలహా మేరకు..
దక్షిణాదిలో విభిన్నమైన సంగీతంతో ప్రేక్షకులను ఆలరిస్తూ దూసుకుపోతున్న మ్యూజిక్ డైరెక్టర్లలో ఎస్ఎస్ థమన్ ఒకరు. చూడటానికి బొద్దుగా థమన్ కనిపిస్తాడు. కానీ ఈ మధ్యకాలంలో స్థూలకాయ సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం. అధిక బరువు సమస్యను తగ్గించుకునేందుకు థమన్ ఓ క్లిష్టమైన సర్జరీకి తయారువుతున్నాడనే వార్త మీడియాలో ప్రచారం జరుగుతున్నది. అదేమిటంటే..

ఎస్పీబీ సూచన మేరకు
థమన్ అధిక బరువు సమస్యకు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కొన్ని సూచనలు ఇచ్చారట. ఆ సూచనలకు అనుగుణంగా థమన్ క్లిష్టమైన సర్జరీకి సిద్దమవుతున్నాడట.

బారియాట్రిక్ సర్జరీకి మొగ్గు
స్థూలకాయ సమస్య నుంచి బయటపడేందుకు బారియాట్రిక్ సర్జరీ చేయించుకోవాలని థమన్ నిర్ణయించుకోన్నారనేది తాజా సమాచారం.
Recommended Video


సన్నిహితులు ఆందోళన
బారియాట్రిక్ సర్జరీ చేయించుకోవడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో తన సన్నిహితులు థమన్‌కు ఆరోగ్యంపై గురించి శ్రద్ధ తీసుకోమని చెబుతున్నారట. సర్జరీ కాకుండా ఆహార నియమాలను పాటించాలని సలహాలు ఇస్తున్నట్టు సమాచారం.

బిజీ షెడ్యూల్ కారణంగా
అయితే బిజీ షెడ్యూల్స్ వల్ల థమన్ తన ఆరోగ్యంపై దృష్టి సారించలేకపోతున్నారట. అందుకే బారియాట్రిక్ సర్జరీకే మొగ్గుచూపుతున్నట్టు తెలిసింది. అయితే అధికారికంగా ఎలాంటి వార్త వెల్లడికాకపోవడం గమనార్హం. గతంలో ఎస్పీ బాలు కూడా ఇదే సర్జరీ చేసుకొన్నట్టు సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











