టైటిల్‌తోనే సెన్సేషన్.. మహేష్ దెబ్బకు రికార్డులన్నీ ఫట్
మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సౌత్‌లో ఏ స్టార్ హీరోకూ లేని సోషల్ మీడియా ఫ్యాన్ బేస్ మహేష్ బాబు సొంతం. బాక్సాఫీస్ లెక్కల్లో మహేష్ బాబు ఎలా దూసుకుపోతాడో.. అంతకు రెట్టించి సోషల్ మీడియాలో మిస్సైల్ స్పీడ్‌తో పరిగెత్తుతాడు. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్ బుక్ అన్నింటా మహేష్ మేనియా కనిపిస్తుంటుంది. మహేష్ బాబు సినిమా అప్‌డేట్స్ అయినా, ఆయన వ్యక్తిగత విషయాలను సంబంధించిన ఫోటోలైనా, వీడియోలైనా ఓ రేంజ్‌లో హల్చల్ చేస్తుంటాయి.

సూపర్ స్టార్ బర్త్ డే స్పెషల్..
సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే స్పెషల్‌గా మహేష్ బాబు తన 27వ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చేశాడు. పరుశురామ్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ మూవీకి సర్కారు వారి పాట అని టైటిల్ అనౌన్సే చేశారు. అధికారికంగా ప్రకటించిన కొద్ది క్షణాల్లోనే తిరుగులేని రికార్డులను సొంతం చేసుకుంది.

లీక్‌పై ఫైర్..
అయితే ఈ టైటిల్ రెండు మూడు రోజుల క్రితమే లీకైంది. ఈ విషయంపై మహేష్ బాబు దర్శకనిర్మాతలపై ఫైర్ అయినట్టు టాక్ వినిపించింది. అయితే లీకైన టైటిల్ పట్ల పాజిటివిటీ రావడంతో యూనిట్ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు.

క్షణాల్లో వైరల్..
నేడు ఉదయం 9 గంటల 9 నిమిషాలకు ప్రకటించిన ఈ టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పాటు మహేష్ బాబు స్టైల్, రూపాయి నాణెం టాటూ ఇలా అన్నీ తెగ హల్చల్ చేస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్విట్టర్‌లో టాప్ స్థానంలో ట్రెండ్ అవుతూనే ఉంది.
Recommended Video

మిలియన్‌కు పైగా..
సర్కారు వారి పాట అని హ్యాష్, మహేష్ బాబు కొత్త సినిమా టైటిల్ కొద్ది క్షణాల్లో మిలియన్ ట్వీట్స్‌ను క్రాస్ చేసింది. ఇప్పటికే టాప్ ప్లేస్‌లోనే ట్రెండ్ అవుతూ దేశ వ్యాప్తంగా చర్చల్లోకి ఎక్కింది. టైటిల్‌తోనే అన్ని రికార్డులు తుడిచేసి ఇంతటి రచ్చ చేస్తే సినిమాతో ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి.


Click it and Unblock the Notifications











