SSMB27 అప్‌డేట్.. ఆ మూడు నిర్మాణ సంస్థల ట్వీట్స్ వైరల్
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం వచ్చేస్తోంది. సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ తరువాత మహేష్ నటించబోయే తదుపరి చిత్రం ఏంటి అనేదానిపై ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఉన్నారు. మహేష్ తదుపరి ప్రాజెక్ట్‌పై ఎన్నో ట్విస్ట్‌లు వచ్చి పడ్డాయి. అన్ని సైడ్ జరిగిపోయి చివరకు పరుశురామ్ చేతికి పగ్గాలు వచ్చాయి. మహేష్ బాబు-పరుశురామ్ కాంబోలో సినిమా రాబోతోందని ఇప్పటికే లీకైంది. అయితే ఈ మూవీకి సంబంధించిన అధికారక ప్రకటన ఇచ్చేందుకు సమయం ఆసన్నమైంది.
Recommended Video

ఎన్నో ట్విస్ట్‌ల అనంతరం..
సరిలేరు నీకెవ్వరు చిత్రం తరువాత మహేష్ బాబు నటించబోయే ప్రాజెక్ట్‌పై అందరికీ ఓ రేంజ్ అంచనాలు ఉండేవి. దానికి తగ్గట్టే వంశీ పైడిపల్లితో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుందని మహేష్ బాబు ప్రకటించాడు. అయితే అనూహ్యంగా వంశీ పైడిపల్లిని పక్కకు తప్పించడంతో కథ మొత్తం మారిపోయింది. ఆ తరువాత ఎన్నో ట్విస్ట్‌ల అనంతరం పరుశురామ్ లైన్‌లోకి వచ్చాడు.

మహేష్ కోసం ప్రయత్నాలు..
గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తరువాత పరుశురామ్ మహేష్ బాబు కోసం ప్రయత్నాలు చేశాడు. అయితే ఆ సమయంలో అది వర్కౌట్ కాలేదు. దీంతో నాగ చైగన్యతతో నాగేశ్వరరావు అనే సినిమాను లైన్‌లో పెట్టేశాడు పరుశురామ్. అయితే తిరిగి మళ్లీ మహేష్ పిలవడంతో వచ్చేశాడు.

కృష్ణ పుట్టినరోజు సందర్భంగా..
మహేష్ కోసం అన్ని అంశాలను మేళవించి ఓ అద్భుత కథను రెడీ చేశానని చెప్పుకొచ్చాడు. సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే (మే 31) సందర్భంగా ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ చిత్రానికి సర్కార్ వారి పాట అనే టైటిల్‌ను పరుశురామ్ ఫిక్స్ చేశాడట.

నిర్మాణ సంస్థల ట్వీట్స్..
మహేష్ 27వ చిత్రం అప్‌డేట్ అంటూ మూడు నిర్మాణలు సంస్థలు చేసిన ట్వీట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. మైత్రీ, ఏఎంబీ, 14రీల్స్ సంస్థలు కలిసి అఫీషియల్, అనౌన్స్‌మెంట్, సూన్ అనే పదాలను షేర్ చేశాయి. దీంతో సూపర్ స్టార్స్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. రేపు ఉదయం 9 గంటల 9 నిమిషాలకు అధికారిక ప్రకటన ఉంటుందని తెలిపారు.


Click it and Unblock the Notifications











