SSMB28: త్రివిక్రమ్ అనుకున్న టైటిల్.. రిజెక్ట్ చేసిన మహేష్.. చర్చల్లోకి మరో టైటిల్!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న మూడవ చిత్రం పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 28వ ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ ఏంటి అనేది ఇంకా ఫిక్స్ కాలేదు.
ఇదివరకే కొన్ని టైటిల్స్ చర్చల్లోకి వచ్చినట్లుగా అనేక రకాల కథనాలు వెలుపడ్డాయి. అయితే ఆ విషయంలో చిత్ర యూనిట్ నుంచి అయితే ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక త్రివిక్రమ్ ఒక టైటిల్ అనుకోగా మహేష్ బాబు దాన్ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక చర్చల్లోకి మరొక టైటిల్ కూడా వచ్చినట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

మర్చిపోలేని సినిమాలు
మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో మొదట అతడు అనే సినిమా చేశాడు. ఇక తర్వాత ఖలేజా సినిమా చాలా గ్యాప్ తర్వాత వచ్చింది. ఆ రెండు సినిమాలు కూడా మహేష్ బాబు కెరీర్ లో మర్చిపోలేని చిత్రాలుగా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద రిజల్ట్ లో తేడా వచ్చినప్పటికీ కూడా ఆ సినిమాలు మహేష్ ఫ్యాన్స్ కు ఇప్పటికీ నచ్చుతాయి. ఆ విధంగా త్రివిక్రమ్ మహేష్ ను సరికొత్తగా ప్రజెంట్ చేశాడు.

ఫ్యాన్స్ నమ్మకం
మూడవసారి మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు అనగానే అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. తప్పకుండా మహేష్ ను సరికొత్తగా ప్రెసెంట్ చేస్తాడు అని ఫ్యాన్స్ అయితే నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ ప్రాజెక్టులో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయట. ఫ్యాన్స్ ఎలాగైతే మహేష్ బాబును చూడాలని అనుకుంటున్నారో అదే తరహాలో కనిపిస్తాడు అని ఇదివరకే నిర్మాత నాగ వంశీ కూడా తెలియజేశాడు.

త్రివిక్రమ్ టైటిల్ రిజెక్ట్
అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మొదట్లో అనుకున్న టైటిల్స్ చాలావరకు నిజం కాదు అని తెలిసిపోయింది. అయితే దర్శకుడు ఇటీవల "అమ్మ మాట" అనే ఒక టైటిల్ అనుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆ టైటిల్ మహేష్ బాబుకు అంతగా నచ్చలేదట. అది అంతగా క్యాచీగా లేదు అని మరొక టైటిల్ ఏదైనా ఉంటే చూడమని చెప్పారట

మరో టైటిల్ అనుకుంటున్న త్రివిక్రమ్
ఇక మహేష్ చెప్పిన వివరణను బట్టి కథకు సెట్ అయ్యే విధంగానే దర్శకుడు మరో టైటిల్ గురించి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే చర్చల్లోకి "ఆరంభం" అనే టైటిల్ కూడా వచ్చినట్లుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక టాక్ అయితే వినిపిస్తోంది. అయితే ఈ టైటిల్ విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. కానీ త్వరలోనే ఏదో ఒక టైటిల్ మాత్రం ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారు.

ఆ రోజున టైటిల్.. ఫస్ట్ లుక్
లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం అయితే SSMB 28వ ప్రాజెక్ట్ టైటిల్ విషయంపై క్లారిటీ ఇవ్వడానికి ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కరెక్ట్ గా ఉగాది రోజున టైటిల్ పాటు ఒక స్పెషల్ లుక్కును కూడా విడుదల చేయాలి అని త్రివిక్రమ్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరి ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేస్తారో ఆ రోజు చూడాలి. ఇక ఈ సినిమాకు థమన్ సంగీత మందిస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











