మహేశ్ - రాజమౌళి మూవీ బడ్జెట్ తేల్చేసిన నిర్మాత .. రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన టాప్ ప్రొడ్యూసర్

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీపై ఇండస్ట్రీలో , అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. యాక్షన్ అడ్వెంచర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న #SSMB29 అప్‌డేట్స్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అన్నింటికి మించి రాజమౌళీ లాస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కగా.. మహేశ్ సినిమా కోసం జక్కన్న ఎంత ఖర్చు పెట్టిస్తున్నాడోనని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాత కేఎల్ నారాయణ కీలక విషయాలు పంచుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

మహేశ్ బాబుతో రాజమౌళి సినిమా అనగానే భారీ బజ్ కామన్. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్‌లో జక్కన్న బిజీగా ఉన్నారు. యాక్షన్ అడ్వెంచర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం క్యాస్ట్ అండ్ క్రూని సెట్ చేసుకునే పనిలో రాజమౌళి ఉన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి #SSMB29కు మ్యూజిక్ డైరెక్టర్‌గా, పీఎస్‌ వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా, వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్‌గా ఆర్‌సీ కమల్ కణ్ణన్, ప్రొడక్షన్ డిజైనర్‌గా మోహన్ బింగి, ఎడిటర్‌గా తమ్మిరాజు, క్యాస్ట్యూమ్ డిజైనర్‌గా రమా రాజమౌళి వ్యవహరిస్తారని ఫిలింనగర్ టాక్.

SSMB29 Producer KL Narayana made sensational comments on mahesh babu rajamouli movie Budget here s the details

అలాగే ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్ హెమ్స్‌వర్క్ ఈ సినిమాకు వర్క్ చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. అలాగే ఇండోనేషియాకు చెందిన చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ను మహేశ్‌కు జోడీగా ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరిగింది. వీరితో పాటు పలువురు నటీనటుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే తన టీమ్‌కు సంబంధించిన ఇతర వివరాలను జక్కన్న అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

రాజమౌళి సినిమా కోసం మహేశ్ సరికొత్తగా మేకోవర్ అవుతున్నారు. గతంలో ఎన్నడూ కనిపించని లుక్‌లో ప్రిన్స్ ఎంట్రీ ఉంటుందని ఫిలింనగర్ టాక్. అమెజాన్ ఫారెస్ట్, గోల్డ్ మైన్స్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తెరకెక్కుతుందని అంటున్నారు కాబట్టి.. అందుకు తగ్గట్లుగా మహేశ్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అలాగే #SSMB29కు గోల్డ్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లుగా మొన్నామధ్య ప్రచారం జరిగింది. అయితే ఈ మూవీ సెట్స్‌పైకి ఎప్పుడు వెళ్లేది ఎప్పుడనేది క్లారిటీ లేదు. అక్టోబర్ 10న రాజమౌళి పుట్టినరోజు కావడంతో ఆ రోజున ఏమైనా స్పెషల్ అనౌన్స్ ఉంటుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

అంతాబాగానే ఉంది కానీ .. ఈ సినిమా బడ్జెట్ ఎంత, మహేశ్ బాబు రెమ్యునరేషన్ ఎంతనే దానిపై ఫిలింనగర్‌లో చర్చ జరుగుతోంది. ఇటీవల ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత కేఎల్ నారాయణ మాట్లాడుతూ కీలక విషయాలు పంచుకున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి సినిమాపై భారీ అంచనాలుంటాయని , అందుకు తగినట్లుగానే ప్లాన్ చేస్తున్నామన్నారు. 18 ఏళ్లు ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చామని అంతా అనుకుంటున్నారని, కానీ తాము ఎక్కడా సినిమాకు దూరం కాలేదని నారాయణ చెప్పారు.

రాజమౌళితో సినిమా డ్రీమ్ ప్రాజెక్ట్ అని.. ఈ మూవీకి రూ.1000 కోట్లు ఖర్చు పెడుతున్నట్లుగా తనను చాలా మంది అడిగారని తెలిపారు. అయితే బడ్జెట్ ఎంత అనేది ఇంకా ఫిక్స్ కాలేదని, ఎంత అవసరం అనుకుంటే అంత ఖర్చు పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు కేఎల్ నారాయణ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: ssmb 29 mahesh babu rajamouli
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X