అభిమానులతో పవన్ కళ్యాణ్ సమావేశం!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో రాజకీయ తెరంగ్రేటం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన ఈ నెల 14వ తేదీన తన పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్‌కు సన్నిహితంగా ఉండే కొందరు ఏర్పాట్లు చూసుకుంటున్నారు.
తన రాజకీయ తెరంగ్రేటం గురించి ప్రెస్ మీట్ ఏర్పాటుకు ఒక రోజు ముందుగానే పవన్ తన అభిమానులో భేటీ కాబోతున్నారు. ఈ మేరకు పలువురు సీనియర్ అభిమానులకు పిలిచినట్లు తెలుస్తోంది . 13వ తేదీన జరిగే ఈ అభిమానుల సమావేశంలో పలు అంశాలను చర్చించబోతున్నట్లు సమాచారం. అభిమానుల సూచనలను కూడా పవన్ కళ్యాణ్ స్వీకరించనున్నాడని టాక్.

14వ తేదీన నిర్వహించే పబ్లిక్ ప్రెస్ మీట్‌తో పాటు, అభిమానుల మీటింగుకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. తెర వెనక ఉండి ఏర్పాట్లు చూసుకుంటున్న వారిలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో పాటు మరికొందరు పవన్ కళ్యాణ్ సన్నిహితులు ఉన్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో తన మద్దతుతో కొందరు అభ్యర్థులను పోటీకి నిలబెట్టి....కొన్ని రోజుల తర్వాత పార్టీ స్థాపించాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారం కోసం పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం లేదని, ప్రజలకు మంచి పాలన తేవాలనే లక్ష్యంతో ఆయన రాజకీయ తెరంగ్రేటం చేస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











